ఆర్చరీలో మెరిసిన ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు

కలం, నిర్మల్‌: నిర్మల్‌ రూరల్‌ మండలం డ్యాంగాపూర్‌ (Dyangapur) గ్రామ సమీపంలోని ప్రభుత్వ ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాలలో మంగళవారం తెలంగాణ ఆర్చరీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా సబ్‌ జూనియర్‌ ఆర్చరీ సెలక్షన్స్‌ నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన 75 మంది విద్యార్థులు ఈ ఎంపిక పోటీలకు హాజరయ్యారు.

బాలికల విభాగంలో ఆరుగురు ఎంపిక

బాలికల విభాగంలో కడెం మండలం అల్లంపల్లి జీఆర్‌ గురుకుల పాఠశాలకు చెందిన నిహారిక, మీనాక్షి, రజితతో పాటు ఆదిలాబాద్‌ జిల్లా చించుఘాట్‌ బాలికల ఆశ్రమ పాఠశాలకు చెందిన శ్రీజ, రామలక్ష్మి, రూప ఎంపికయ్యారు.

బాలుర విభాగంలో ఆరుగురికి చోటు

బాలుర విభాగంలో డ్యాంగాపూర్‌ (Dyangapur) ప్రభుత్వ బాలుర ఆశ్రమ పాఠశాలకు చెందిన రంజిత్‌ సింగ్‌, కరణ్‌, తరుణ్‌తో పాటు కడెం మండలం అల్లంపల్లి జీఆర్‌ గురుకుల పాఠశాలకు చెందిన జగన్‌, సునీల్‌, సుశాంత్‌ ఎంపికయ్యారు. మొత్తం 12 మంది క్రీడాకారులు ఈ నెల 6న హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించనున్న పోటీల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులను జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి నిహారిక, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అనూష, జిల్లా క్రీడల అధికారి రమేష్‌, ఆర్చరీ కార్యదర్శి అంబేద్కర్‌, పీఈటీలు గంగన్న, జ్యోతి, వందన, వినోద్‌, కోచ్‌లు జగదీర్‌రావు, జైతూ అభినందించారు. హైదరాబాద్‌లో జరిగే పోటీల్లో ప్రతిభ కనబరిచి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

Also Read : హైడ్రా అభ్యంతరం.. గణేశ్ నిమజ్జనాలపై కొత్త వివాదం

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>