కలం, మహబూబ్‌నగర్ బ్యూరో : పాత ఏజెన్సీల స్థానంలో కొత్త ఏజెన్సీలు మారినంత మాత్రాన ప్రభుత్వ ఆదేశాల మేరకు సకాలంలో వేతనాలు చెల్లించరా అని తెలంగాణ మెడికల్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయిస్ (Outsourcing Employees) యూనియన్ బ్రాంచ్ అధ్యక్షుడు గోపాల్ నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం మహబూబ్ నగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రంగా అజ్మీర సూపరిండెంట్ గా బాధ్యతలు స్వీకరించి ఏడాది గడిచిన సందర్భంగా ఏఐటీయూసీ అనుబంధ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ సిబ్బంది శాలువాలతో ఘనంగా సత్కరించారు.
అనంతరం ఒకటవ తేదీ నాడే జీతాలు కచ్చితంగా చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని వినతి పత్రాన్ని అందజేశారు. నూతన ఏజెన్సీలు తక్షణమే సిబ్బందికి వేతనాలు అందించాలని లేకపోతే ఆందోళన బాట పడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మెడికల్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ బ్రాంచ్ నాయకులు సిబ్బంది ఎం.రఘు, మునీర్, రఘురాం, భూపతి, రవి, లక్ష్మి,అన్నపూర్ణ, సురేఖ, కొండమ్మ, భాగ్యలక్ష్మి, గీత తదితరులు పాల్గొన్నారు.

