కలం, జోగులాంబ గద్వాల: జోగులాంబ గద్వాల (Jogulamba Gadwal) మైనారిటీ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులు రాష్ట్ర స్థాయి యోగా పోటీలకు (Yoga Competitions) ఎంపికయ్యారు. ఉమ్మడి మహబూబ్నగర్లో జిల్లా స్థాయి యోగా పోటీల్లో ప్రతిభ కనబర్చి విద్యార్థినులు సఫీనా, అసీనాలు ఈ ఘనత సాధించినట్లు ప్రిన్సిపాల్ భవాని, పీఈటీ రాధ తెలిపారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) ఆధ్వర్యంలో ఈ జిల్లా స్థాయి అండర్-14, అండర్-17 బాలబాలికల యోగా ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ నెల 11వ తేదీ నుండి 13వ తేదీ వరకు సిద్ధిపేటలో జరగనున్న రాష్ట్ర స్థాయి అండర్-17 యోగా పోటీలలో వీరిద్దరూ జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థినులను పాఠశాల ప్రిన్సిపాల్ భవాని, పీఈటీ రాధ, అధ్యాపక బృందం ప్రత్యేకంగా అభినందించారు. ప్రిన్సిపాల్ భవాని మాట్లాడుతూ.. విద్యార్థినులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించడం అభినందనీయమన్నారు. సిద్ధిపేటలో జరిగే రాష్ట్ర స్థాయి యోగా పోటీల్లో కూడా తమ ప్రతిభను చాటి విజయం సాధించి పాఠశాలకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

