Mobile Popup Ad
Mobile Popup Ad

నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు: జోగులాంబ గద్వాల కలెక్టర్

కలం, జోగులాంబ గద్వాల: గడువు ముగిసిన నకిలీ విత్తనాలను రైతులకు అంటగడితే సంబంధిత డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని జోగులాంబ గద్వాల (Jogulamba Gadwal) కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ హెచ్చరించారు. గద్వాల జిల్లా కేంద్రంలో పాత బస్టాండ్‌లో పలు విత్తనాలు, ఎరువుల దుకాణాలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. పలు కంపెనీల వివిధ రకాల విత్తనాల ప్యాకెట్లను పరిశీలించారు. వానాకాలం 2026 సీజన్‌కు సంబంధించి వ్యవసాయ శాఖ సూచించిన ఎనిమిది రకాల వరి వంగడాలను మాత్రమే రైతులు సాగు చేయాల్సి ఉందన్నారు. డీలర్లు వాటిని మాత్రమే విక్రయించాలన్నారు. బీపీటీ 5204, ఆర్ఎన్ఆర్ 15048, కేఎన్ఎం 1638, డబ్ల్యూజీఎల్ 962, డబ్ల్యూజీఎల్ 44, జేజిఎల్ 1798, జైశ్రీరామ్, హెచ్ఎంటి (సోనా) రకాలకు మాత్రమే బోనస్ వస్తుందన్నారు. ప్రతి పెస్టిసైడ్, సీడ్స్ దుకాణాల వద్ద స్టాక్ బోర్డులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. పలువురు డీలర్లు రైతులకు ఇచ్చే రసీదుల్లో ఇష్టానుసారం సొంతంగా నిబంధనలను ముద్రించడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గద్వాల పట్టణంలోని ప్రధాన రహదారులు, ముఖ్యమైన కూడళ్లలో ఇష్టానుసారం ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే తీసివేయించాలని మున్సిపల్ కమిషనర్ జానకీరామ్ సాగర్‌కు సూచించారు. ఈ పర్యటనలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి వీరప్ప, మండల వ్యవసాయ అధికారి ప్రతాప్ కుమార్, టెక్నికల్ ఏవోలు చంద్రశేఖర్, భవానీ తదితరులున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>