కలం, వెబ్‌డెస్క్: తెలంగాణ (Telangana) ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. మే 1వ తేదీ నుంచి జిల్లా కేంద్రాల్లో జామ్ మేళాలు నిర్వహించనున్నట్లు కీలక ప్రకటన చేసింది. ఈ జాబ్ మేళా ద్వారా 20 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ మేళాలో 250 కి పైగా కంపెనీలు పాల్గొంటున్నట్లు స్పష్టం చేసింది. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది.

