కలం, వెబ్ డెస్క్: ప్రస్తుతం ఫోక్స్ సాంగ్స్ ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఉర్రూతలూగిస్తున్నాయి. ఎక్కడ చూసినా ఫోక్ సాంగ్స్‌దే హవా కనిపిస్తోంది. ఇప్పటికే ‘ఏష నాగుల కట్టమీద’ పాట ప్రేక్షకులను ఉర్రూతలూగించగా, తాజాగా ‘జిమ్ జిమ్ తార’ (Jim Jim Tara) పాట అందరి నోటా వినిపిస్తోంది. గోకుల లక్ష్మీదేవి పాడిన ఈ తెలుగు జానపద పాట సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సామాన్యులే కాదు.. సెలబ్రిటీలు సైతం ఈ పాటను పాడుతున్నారు.
తాజాగా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఇంటర్ మయామి క్లబ్ తన ప్రాక్టీస్ వీడియోలో ఈ పాటను ఉపయోగించింది. క్లబ్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేయడంతో తెలుగు జానపద గీతానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తోంది. తెలుగు పాటకు ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్ క్లబ్ నుంచి లభించిన ఈ ప్రాధాన్యం ఆనందపరుస్తోంది. దీంతో ‘జిమ్ జిమ్ తార’ పాట మరింత మంది దృష్టిని ఆకర్షిస్తోంది.

