బ్యాలెట్ లోనూ ఓటమి.. రాహుల్ గాంధీ ఆన్సర్ ఏంటి?: కిషన్ రెడ్డి

కలం, వెబ్ డెస్క్ : ఈవీఎంల ద్వారా ప్రజాస్వామ్య పద్దతిలో జరుగుతున్న ఎన్నికలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అబద్ధపు ప్రచారం చేస్తున్నారని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌ రెడ్డి (Kishan Reddy) అన్నారు. ప్రజా సమస్యలపై పోరాడే సత్తా లేకనే కాంగ్రెస్‌ పార్టీ నేతలు అడ్డగోలు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. బ్యాలెట్ పేపర్‌తో జరిగే స్థానిక ఎన్నికల్లోనూ కాంగ్రెస్ వరుసగా ఎందుకు ఓడిపోతోందో రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో గెలుపు బాధ్యత ఎలక్షన్‌ కమిషన్‌దా లేక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిదా అని ప్రశ్నించిన ఆయన, రాజ్యాంగ సంస్థలను అప్రతిష్టపాలు చేయడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందని ఫైర్ అయ్యారు.

ప్రభుత్వ ఉన్నతాధికారులు 200 మంది తమతో టచ్‌లో ఉన్నారంటూ రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించడం అధికారులను బెదిరించడమేనని కిషన్‌ రెడ్డి ఆరోపించారు. SIR ప్రక్రియలో ఏవైనా లోపాలు ఉంటే బాధ్యతాయుతంగా ఆధారాలతో నిరూపించాలి తప్ప, ఇలాంటి బెదిరింపు ధోరణులు తగదన్నారు. దేశాన్ని సోనియా గాంధీ కుటుంబ ఆస్తిగా కాంగ్రెస్‌ భావిస్తోందని, దేశంలోని 140 కోట్ల మంది ప్రజలకు ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించే పూర్తి హక్కు ఉందని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌కు ఓటు వేయకపోతే ఎన్నికల సంఘం తప్పు చేసినట్లుగా ఆ పార్టీ వ్యవహరించడం వారి నియంతృత్వ రాజకీయాలకు నిదర్శనమని విమర్శలు గుప్పించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>