సంగారెడ్డి జిల్లాలో ఆకాల వర్షం.. రైతులకు తీరని నష్టం

కలం, మెదక్ బ్యూరో: గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో సంగారెడ్డి జిల్లా రైతులు (Sangareddy Farmers) తీవ్ర నష్టాల పాలవుతున్నారు. ఆందోల్, సంగారెడ్డి, నర్సాపూర్ నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాలు, పొలాల వద్ద ఉన్న వడ్లు తడిసిపోయాయి. ఆకాల వర్షాలతో కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే ముందు నీళ్ల పాలు అయ్యిందని, వెంటనే వ్యవసాయ విస్తరణ అధికారులు నష్ట పోయిన తమ పంటను పరిశీలించాలని కోరుతున్నారు.

కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు అవసరమైన టార్పాలిన్లు లేకపోవడంతో ధ్యానం రాశులు తడిసిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు అవసరమైన సౌకర్యాలు కల్పించి, వడ్ల కొనుగోలు కేంద్రాలకు లారీలను వెంటనే పంపి, అకాల వర్షానికి తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. మరో వైపు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా వడ్లు తడిసి రైతులు నష్టపోయారని, వడ్ల కొనుగోలు కేంద్రాలల్లో సక్రమంగా పనిచేయని అధికారులపై చర్యలు తీసుకోవాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>