ఝార్ఖండ్ ఘటన.. రూ.8లక్షలు అప్పు చేసి ఎయిర్ అంబులెన్స్ బుకింగ్..

కలం, డెస్క్ : ఝార్ఖండ్ ఎయిర్ అంబులెన్స్ ఘటనలో (Jharkhand Incident) మనసు కలిచివేసే విషయాలు బయటకొస్తున్నాయి. ఝార్ఖండ్ లో ఎయిర్ అంబులెన్స్ కూలిపోయి ఏడుగురు చనిపోయిన విషయం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. అయితే ఈ ఎయిర్ అంబులెన్స్ ను రూ.8 లక్షలు అప్పు చేసి మరీ బుక్ చేసుకున్నారు. ఝార్ఖండ్ రాజధాని రాంచి (Ranchi) దగ్గర్లోని చంద్వా ప్రాంతానికి చెందిన సంజయ్ సాహు ఒక హోటల్ నడుపుతున్నాడు. సోమవారం అతని హోటల్ లో షార్ట్ సర్క్యూట్ జరగడంతో.. సంజయ్ సాహు శరీరం 65 శాతం కాలిపోయింది.

ఆయన పరిస్థితి సీరియస్ గా ఉండటంతో.. ఢిల్లీకి తరలించేందుకు సంజయ్ భార్య అర్చన, ఇద్దరు మిత్రులు కలిసి రూ.8 లక్షలు అప్పు చేసి మరీ రెడ్ బర్డ్ ఎయిర్ వేస్ కంపెనీకి చెందిన ఎయిర్ అంబులెన్స్ బుక్ చేశారు. సంజయ్, అతని భార్య అర్చనా, ఒక కుటుంబ సభ్యుడు, డాక్టర్, ఒక సహాయకుడు, ఇద్దరు పైలట్లు.. మొత్తం ఏడుగురు కలిసి ఇందులో ప్రయాణం ప్రారంభించారు. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే వాతావరణం మారిపోవడంతో.. కోల్ కత్తాకు తరలించాలని అనుకున్నారు. కానీ ఏటీసీతో (Aair Traffic Control) సంబంధాలు తెగిపోయిన కొద్ది సేపటికే ఎయిర్ అంబులెన్స్ చత్రా అటవీ ప్రాంతంలో కూలిపోయింది (Jharkhand Incident). ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. షార్ట్ సర్క్యూట్ తో సంజయ్ ప్రాణాలు పోలేదు గానీ.. ఎయిర్ అంబులెన్స్ వల్ల ఏడుగురు చనిపోయే పరిస్థితి వచ్చిందంటున్నారు ఆయన సన్నిహితులు.

Read Also: ఇన్ స్టాలో వీడియోలు.. యువకుడిపై సర్పంచ్ దాడి..

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>