Mobile Popup Ad
Mobile Popup Ad

పెట్రోల్ బంకు ఏర్పాటు చేయాలి.. సీఎంకు జీవన్ రెడ్డి లేఖ

కలం, కరీంనగర్ బ్యూరో: జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఓల్డ్ బస్ స్టేషన్ ప్రాంతంలో వద్ద గల పోలీస్ క్వార్టర్స్ లో పెట్రోల్, డీజిల్ పంపు ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ (BRS) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి (Jeevan Reddy) కోరారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయతలపెట్టి, నిలిచిపోయిన ప్రక్రియను వెంటనే తక్షణమే పూర్తి చేయాలన్నారు. ఈ మేరకు సోమవారం జీవన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ను కలిసి ఈ లేఖను జీవన్ రెడ్డి ఆయనకు అందజేశారు.

జగిత్యాల జిల్లా కేంద్రమైన తర్వాత వాహనాల సంఖ్య భారీగా పెరిగిందని, ఓల్డ్ బస్ స్టేషన్ నుండి 2 నుండి 5 కిలోమీటర్ల పరిధిలో ఒక్క పెట్రోల్ బంకు కూడా లేదని ఆయన లేఖలో పేర్కొన్నారు. దీంతో ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. యావర్ రోడ్డుపై ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించేందుకు ఓల్డ్ బస్ స్టేషన్ వద్ద బంకు ఏర్పాటు అత్యవసరమన్నారు.

ప్రస్తుతం ఖాళీగా ఉన్న పోలీస్ క్వార్టర్స్ స్థలంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలోనే పెట్రోల్ బంకు ఏర్పాటు చేస్తే పోలీస్ సిబ్బంది కుటుంబాలకు, స్థానిక ప్రజలకు మేలు జరుగుతుందని జీవన్ రెడ్డి వివరించారు. హిందుస్థాన్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం కంపెనీలతో చర్చించి వెంటనే చర్యలు తీసుకోవాలని అయన కోరారు. ఈ లేఖ కాపీలను రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్, ఐజీపీ రమేష్ లకు పంపినట్లు జిల్లా ఎస్పీతో జీవన్ రెడ్డి తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>