కలం, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy), టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ల తీరుపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి (Jeevan Reddy) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణలో మళ్లీ తమ జోడీయే అధికారంలోకి వస్తుందని రేవంత్ రెడ్డి, మహేష్ గౌడ్ (Mahesh Kumar Goud) ఒకరికొకరు సర్టిఫికేట్లు ఇచ్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల నాటికి ఈ జోడీ అసలు ఉంటుందో లేదో ఎవరికీ తెలియదని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల సమయానికి పీసీసీ అధ్యక్షుడిగా ఎవరు ఉంటారో మహేష్ గౌడ్‌కు తెలియదని, ముఖ్యమంత్రి పీఠంపై ఎవరు ఉంటారో రేవంత్ రెడ్డికే స్పష్టత లేదని ఎద్దేవా చేశారు.
గతంలో రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్గిరి ఎంపీ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేదని, ఈ జోడీ ముఖం చూసి ప్రజలు ఓట్లు వేస్తారనుకోవడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. సిరిసిల్లలో కాంగ్రెస్ గెలిస్తే నేతన్నను మంత్రిని చేస్తానంటూ రేవంత్ రెడ్డి ప్రకటనలు చేయడంపై స్పందిస్తూ, ముందు కొడంగల్‌లో గెలిచి చూపించాలని సవాల్ విసిరారు.
కెసిఆర్ తెలంగాణ ఉద్యమ సమయంలో సిరిసిల్ల నేతన్నల సంక్షేమం కోసం రూ.50 లక్షల నిధులు సేకరించి వారి ఆధ్వర్యంలో డిపాజిట్ చేసిన విషయాన్ని జీవన్ రెడ్డి (Jeevan Reddy) గుర్తుచేశారు. కేసీఆర్ కరీంనగర్, మహబూబ్ నగర్ నుంచి పోటీ చేయడాన్ని రేవంత్ రెడ్డి విమర్శించడాన్ని ఆయన తప్పుబట్టారు. కేసీఆర్ రాష్ట్రస్థాయి ఉద్యమ నాయకుడని, ఆయన రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పోటీ చేసే హక్కు ఉందని స్పష్టం చేశారు. గెలిస్తేనే మంత్రి పదవి ఇవ్వడానికి సాధ్యమవుతుందని, అసలు రేవంత్ రెడ్డి ముందు కొడంగల్‌లో విజయం సాధించాలని హితవు పలికారు.
Also Read : యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌కు భారీగా విరాళం
Follow Us On: X(Twitter)

