కలం, వెబ్ డెస్క్ : తాడిపత్రి (Tadipatri) మాజీ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy) తన బర్త్‌డే వేడుకలను వినూత్నంగా జరపాలని నిర్ణయించారు. ఈ నెల 25న జరగనున్న తన జన్మదిన వేడుకల కోసం ఆయన నియోజకవర్గ ప్రజలను మూడు ఆసక్తికర ప్రశ్నలు అడిగారు. మొదటి ప్రశ్నగా ‘నా బర్త్‌డే వేడుకలు ఎలా ఉండాలి?’ అని ప్రజలను అడిగారు. రెండవ ప్రశ్నలో సమాజంలో మహిళలు ఏ విధంగా ఉండాలి అనే విషయంపై అభిప్రాయాలు కోరారు. మూడవ ప్రశ్నగా 2026 సంవత్సరంలో విద్యార్థులు ఏ విధంగా ఉండాలి అనే అంశాన్ని ప్రజల ముందు ఉంచారు. ఈ మూడు ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇచ్చిన వారికి ప్రత్యేక బహుమతులు అందజేస్తామని జేసీ ప్రకటించారు. ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ఆయన తెలిపారు. ఈ వినూత్న ఆలోచన ప్రస్తుతం తాడిపత్రి నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.

