కలం, స్పోర్ట్స్: ఐపీఎల్ (IPL) 2026లో ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా (Jasprit Bumrah) ఫామ్‌పై తీవ్ర చర్చ నడుస్తోంది. ఐదు మ్యాచ్‌ల్లో ఒక్క వికెట్ కూడా తీయలేదు బుమ్రా.. దీంతో పేసర్ బౌలింగ్ పదును తగ్గిందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన తాజా పోరులోనూ బుమ్రా 41 పరుగులు ఇచ్చి వికెట్లేమీ సాధించలేకపోయారు. దీనిపై మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan) తన యూట్యూబ్ ఛానెల్‌లో కీలక విశ్లేషణ చేశారు. బుమ్రా బౌలింగ్‌లో వేగం తగ్గడమే కాకుండా, స్లోయర్ డెలివరీలను మరీ షార్ట్‌గా వేస్తున్నారని పఠాన్ అభిప్రాయపడ్డారు. బుమ్రా బంతిని కాస్త ఫుల్లర్ లెంగ్త్‌లో వేయాలని, వేగంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఆయనకు ఎటువంటి గాయం లేకపోయినా, ఈ సాంకేతిక లోపాల వల్లే వికెట్లు దక్కడం లేదని పేర్కొన్నారు.
మరోవైపు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీని, బ్యాటింగ్‌ను పఠాన్ కొనియాడారు. 196 పరుగుల లక్ష్య ఛేదనలో అయ్యర్ 35 బంతుల్లో 66 పరుగులు చేసి జట్టును గెలిపించిన తీరు అద్భుతమని మెచ్చుకున్నారు. బుమ్రా వేసిన షార్ట్ బాల్‌ను ముందే ఊహించి సిక్సర్ కొట్టడం అతని నియంత్రణకు నిదర్శనమని చెప్పారు. ఫీల్డ్ మార్పులు, బౌలర్ల రొటేషన్ విషయంలోనూ అయ్యర్ పరిణతి ప్రదర్శించారని ప్రశంసించారు. ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ 39 బంతుల్లో 80 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలవడంపై పఠాన్ (Irfan Pathan) స్పందిస్తూ, అతనిలో గత ఏడాది కంటే ఎక్కువ మెచ్యూరిటీ కనిపిస్తోందన్నారు. స్లో బౌలర్ల వేగాన్ని అంచనా వేస్తూ భారీ షాట్లు ఆడటంలో అతను విజయం సాధించాడని వివరించారు. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో పంజాబ్ చేతిలో ఓటమి పాలైంది. రాబోయే మ్యాచ్‌ల్లో బుమ్రా తన లోపాలను సరిదిద్దుకుని మళ్లీ ఫామ్‌లోకి వస్తారని క్రీడాభిమానులు ఆశిస్తున్నారు.
Read Also: ఉప్పల్ వేదికగా ధోని మేనియా.. పసుపు వర్ణంగా మారనున్న స్టేడియం!
Follow Us On: X(Twitter)

