బుమ్రా ఫిట్ కాకపోతే.. ప్రిన్స్‌కు ఛాన్స్!

కలం, స్పోర్ట్స్ : జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ఫిట్‌నెస్‌పై ఉత్కంఠ కొనసాగుతోంది. ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు అతడికి ఫిట్‌నెస్ పరీక్షలు జరగనున్నాయి. ఒకవేళ బుమ్రా అందుబాటులో లేకపోతే ప్రిన్స్ యాదవ్‌ను బ్యాకప్‌గా సిద్ధంగా ఉంచాలని సెలెక్టర్లు భావిస్తున్నారు. బుమ్రాతో పాటు నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణాకు కూడా మ్యాచ్ సిమ్యులేషన్ పరీక్షలు జరగనున్నాయి. సెప్టెంబర్ 4 నుంచి 9 వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. వైద్య బృందం ఇప్పటికే ఈ నలుగురిని క్లినికల్‌గా ఫిట్‌గా తేల్చింది.

అయితే మ్యాచ్ పరిస్థితుల్లో వారి ఫిట్‌నెస్ ఎలా ఉంటుందో చూడాలని నిర్ణయించారు. సెప్టెంబర్ 10న భారత జట్టు ఢిల్లీలో సమావేశం కానుంది. ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్ సెప్టెంబర్ 13 నుంచి ప్రారంభం కానుంది. ఇక ప్రిన్స్ యాదవ్‌కు ఇప్పటికే ఫిట్‌నెస్ క్లియరెన్స్ లభించింది. ఆఫ్ఘనిస్థాన్‌తో వన్డే సిరీస్‌లోనే అతడు అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అయితే జూలై 25న జింబాబ్వేతో రెండో టీ20లో ప్రిన్స్‌కు హ్యామ్‌స్ట్రింగ్ గాయం అయింది. ఇప్పుడు కోలుకున్న అతడు ఎంపికకు అందుబాటులో ఉన్నాడు.

ఈ ఏడాది ఐపీఎల్ తర్వాత టీ20ల్లో ప్రిన్స్ మంచి ప్రదర్శన ఇచ్చాడు. దీంతో సెలెక్టర్లు అతడిని భవిష్యత్తుకు ఉపయోగపడే ఆటగాడిగా చూస్తున్నారు. మరోవైపు న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌కు ముందు బుమ్రా కనీసం ఒక ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ ఆడాలని సెలెక్టర్లు భావిస్తున్నారు. అతడి మోకాలు సుదీర్ఘ ఫార్మాట్ భారాన్ని తట్టుకోగలవా అనేది పరీక్షించాలనుకుంటున్నారు. ప్రస్తుతం బుమ్రా ఫిట్‌నెస్ పరీక్షల ఫలితాలపైనే అతడి తదుపరి ప్రయాణం ఆధారపడి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>