Mobile Popup Ad
Mobile Popup Ad

వింబుల్డన్ 2026: ప్రైజ్ మనీ వివాదంపై జాన్నిక్ సిన్నర్ వ్యాఖ్యలు

కలం, స్పోర్ట్స్​ : వింబుల్డన్ 2026 టోర్నీ ప్రైజ్ మనీపై తీవ్ర రచ్చ జరుగుతోంది. ఈ రచ్చ తాజాగా పతాక స్థాయికి చేరింది. దీనిపై తాజాగా వరల్డ్ నెం.1 టెన్నిస్ స్టార్ జానిక్ సిన్నర్ (Jannik Sinner) స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియా ముందు ఈ అంశంపై స్పందించిన సిన్నర్.. వివాదాస్పద ప్రశ్నలపై ఘాటుగా స్పందించారు.

ప్రస్తుతం తనకు రాజకీయాలు వద్దని, కేవలం టెన్నిస్ గురించి మాత్రమే మాట్లాడతానని తేల్చి చెప్పారు. అసలు వివాదం పదేళ్ల క్రితం మొదలైంది. అప్పట్లో వింబుల్డన్ ఆదాయంలో ఆటగాళ్లకు 14.9 శాతం వాటా దక్కేది. కానీ ఇటీవల ఫ్రెంచ్ ఓపెన్‌లో ఈ వాటా 14.3 శాతానికి పడిపోయింది. దీంతో ఆటగాళ్లు తిరుగుబాటు జెండా ఎగరేశారు. తమకు సరైన వాటా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.

ఈ నిరసనలో భాగంగా వింబుల్డన్ మొదటి వారంలో మ్యాచ్ ముగిశాక కేవలం 15 నిమిషాలు మాత్రమే మీడియాతో మాట్లాడాలని ప్లేయర్స్ నిర్ణయించుకున్నారు. ఆటగాళ్ల నిర్ణయంతో వింబుల్డన్ నిర్వాహకులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ ఏడాది ప్లేయర్స్ వాటా కేవలం 14.4 శాతమేనని ప్రతినిధి సంస్థ ప్రకటించడంతో యాజమాన్యం దిద్దుబాటు చర్యలు చేపట్టింది.

ప్రైజ్ మనీని ఏకంగా 20 శాతం పెంచింది. దీనివల్ల సింగిల్స్ విజేతలకు భారీగా 3.6 మిలియన్ పౌండ్లు దక్కనున్నాయి. అంతేకాకుండా సమస్యల పరిష్కారానికి ప్లేయర్ కౌన్సిల్ ఏర్పాటు చేస్తామని కూడా వింబుల్డన్ ప్రతిపాదించింది. ఈ హాట్ సిట్యుయేషన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ సిన్నర్ ప్రెస్ మీట్‌కు హాజరయ్యారు. నిర్వాహకులు టైమర్ ఆన్ చేయడంతో ఆయన కేవలం పదిన్నర నిమిషాల్లోనే ముగించారు.

ప్రస్తుతం చర్చలు సాగుతున్నాయని, అయితే తాము వంద శాతం సంతృప్తిగా లేమని సిన్నర్ స్పష్టం చేశారు. ఇది కేవలం డబ్బు గురించే కాదని, ప్లేయర్స్ సంక్షేమం కూడా ముఖ్యమని చెప్పారు. టోర్నీ బహిష్కరణ లేదా కౌన్సిల్ ఏర్పాటుపై మాట్లాడటానికి ఆయన నిరాకరించారు. తమ డిమాండ్లు ఏంటో గ్రాండ్ స్లామ్ నిర్వాహకులకు బాగా తెలుసని చురకలు అంటించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>