నేనూ డీప్ ఫేక్ బాధితురాలినే : జాన్వీ కపూర్

కలం, సినిమా : బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తనకు ఎదురైన డీప్‌ఫేక్ (Deep Fake) సమస్యలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కూడా డీప్‌ఫేక్ బాధితురాలినేనని వెల్లడిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె, తను 15 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే తన ఫోటోలను పోర్న్ వెబ్‌సైట్‌లో పెట్టారని తెలిపారు. ఆ ఫోటోలను తోటి విద్యార్థులు చూపించడంతో మానసికంగా బాధపడ్డానని చెప్పారు. ఈ సంఘటన తనపై తీవ్ర ప్రభావం చూపిందని, ఆ వయసులో అలాంటి పరిస్థితిని ఎదుర్కోవడం చాలా కష్టంగా అనిపించిందని జాన్వీ పేర్కొన్నారు.

ప్రస్తుతం టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ డీప్‌ఫేక్ సమస్యలు ఇంకా ఎక్కువవుతున్నాయని, ఇప్పటికీ తనకు అలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని వెల్లడించారు. డీప్‌ఫేక్‌ల వల్ల వ్యక్తిగత గోప్యతకు ముప్పు ఏర్పడుతోందని, మహిళలు ముఖ్యంగా ఎక్కువగా బాధితులవుతున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి నేరాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని జాన్వీ కపూర్ (Janhvi Kapoor) సూచించారు.

Read Also: నా కోసం సుప్రియ షూటింగ్ ఆపేసింది: మృణాల్ ఠాకూర్‌

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>