చ‌ర్చ‌లు విఫ‌ల‌మైతే ఇరాన్‌ను నాశ‌నం చేస్తాం : ట్రంప్ హెచ్చరిక

క‌లం, వెబ్ డెస్క్‌: ఇరాన్‌ (Iran)కు విధించిన 48 గంటల గడువు ముగియనున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మ‌రోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో చర్చలు జరుగుతున్నాయని, సోమవారం నాటికి ఒక ఒప్పందానికి వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. అయితే ఒకవేళ చర్చలు విఫలమైతే ఇరాన్‌ను సర్వనాశనం చేస్తామని, ఆ దేశంలోని చమురు సంపదను తమ ఆధీనంలోకి తీసుకుంటామని ట్రంప్ హెచ్చరించారు. ముఖ్యంగా అంతర్జాతీయ వాణిజ్యానికి కీలకమైన హార్ముజ్ జలసంధిని వెంటనే తెరిచేలా ఇరాన్‌పై ఒత్తిడి పెంచారు.

మరోవైపు గతంలో ఇరాన్‌లోని ఆందోళనకారుల కోసం అమెరికా పంపిన ఆయుధాల గురించి ట్రంప్ (Donald Trump) కీలక వ్యాఖ్యలు చేశారు. కుర్దిష్ మార్గాల ద్వారా తాము ఆయుధాలను పంపామని, అయితే అవి ఆందోళనకారులకు చేరకుండా కుర్దిష్ గ్రూపులే తమ వద్ద ఉంచుకున్నాయని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. వైట్ హౌస్‌లో జరగనున్న సైనిక ఉన్నతాధికారుల సమావేశానికి ముందే ట్రంప్ ఈ తరహా హెచ్చరికలు జారీ చేయడం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది.

Read Also: నా కోసం సుప్రియ షూటింగ్ ఆపేసింది: మృణాల్ ఠాకూర్‌

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>