జనగామలో పేకాట రాయుళ్ల అరెస్ట్

కలం, జనగామ : జనగామ (Jangaon) పట్టణంలోని గణేష్ వీధిలో జూదం ఆడుతున్న వారిపై పోలీసులు ఆకస్మికంగా దాడి చేశారు. విశ్వసనీయ సమాచారం అందడంతో ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలో, ఎస్‌ఐ భరత్ పోలీసు సిబ్బంది కలిసి తనిఖీలు చేపట్టి పేకాట ఆడుతున్న ఐదుగురిని అరెస్ట్ చేశారు. దాడి సమయంలో నిందితులు కార్డులు ఆడుతూ పట్టుబడగా, వారి వద్ద నుంచి రూ.14,400 నగదు, పేక ముక్కలు, ఐదు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసిన నిందితులపై కేసు నమోదు చేసి, తదుపరి చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>