దిగ్బంధం షురూ.. ట్రంప్ డెడ్లీ వార్నింగ్

కలం, వెబ్ డెస్క్ : శాంతి చర్చలు విఫలమైన వేళ అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Trump) ఆదేశాలతో అమెరికా సైన్యం హార్మూజ్ జలసంధిని దిగ్బంధనంలోకి తీసుకొంది. ఇరాన్ ఓడరేవుల వైపు వెళ్లే అన్ని నౌకలను అమెరికా సైన్యం అడ్డుకుంటోంది. ఇరాన్ పోర్టులకు వెళ్లే, బయటకు వచ్చే నౌకలను అడ్డుకుంటామని అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. అయితే ఇరానేతర పోర్టులకు వెళ్లి వచ్చే వాటికి అంతగా ఆటంకాలు కలిగించబోమని స్పష్టం చేసింది.

ఇదిలాఉంటే అమెరికా విధించిన దిగ్బంధనం వైపు వచ్చే ఇరాన్ నౌకలను నాశనం చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ఈ మేరకు డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే ఇరాన్ కు చెందిన 158 నౌకలను అమెరికా దళాలు పూర్తిగా నాశనం చేశాయని, అవి ఇప్పుడు సముద్ర గర్భంలో ఉన్నాయని వెల్లడించారు. ఇరాన్ వద్ద ఉన్న ఫాస్ట్ అటాక్ షిప్స్ ను ఇప్పటివరకు లక్ష్యంగా చేసుకోలేదని, వాటిని పెద్ద ముప్పుగా తాము భావించడం లేదని చెప్పుకొచ్చారు. అయితే ఓడరేవులు దిగ్భంధిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇప్పటికే ఇరాన్ ప్రకటించింది. తాజా పరిణామంతో ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్త పరిస్థితులు తారాస్థాయికి చేరుకున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>