Mobile Popup Ad
Mobile Popup Ad

ఈతకు వెళ్లి వికలాంగుడు మృతి?

కలం, జనగామ: జనగామ (Jangaon) జిల్లా బచ్చన్నపేట మండలంలోని రామచంద్రగూడెం గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఈతకు వెళ్లిన ఓ వికలాంగుడు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. రామచంద్రపురం గ్రామానికి చెందిన చీర కరుణాకర్ అనే వికలాంగుడు ఈత కొట్టేందుకు వెళ్లాడు. ఈత కొడుతున్న సమయంలో అకస్మాత్తుగా నీటిలో మునిగి గల్లంతైనట్లు తెలిపారు. కొంతసేపు గడిచినా బయటకు రాకపోవడంతో అనుమానించిన గ్రామస్తులు గాలింపు చేపట్టారు. ఎంత‌కూ మృతదేహం ల‌భ్యం కాకపోవడంతో తీవ్ర‌ ఆందోళనకు గుర‌య్యారు. ఘటనపై గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించగా, సంఘటన స్థలానికి ఎస్సై ఏ.శ్రీకాంత్ చేరుకొని గాలింపు చర్యలను ముమ్మరంగా చేపట్టి మృతదేహాన్ని గుర్తించి బయటకు తీశారు. కేసు న‌మోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>