కలం, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో అనూహ్య రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికల ఫలితాలు వెలువడటానికి ముందే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేయడం, కేరళ (Kerala) ముఖ్యమంత్రి పినరయి విజయన్ తన ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతాలో సీఎం హోదాను తొలగించడం చర్చనీయాంశంగా మారింది. రేపు (మే 4) ఓట్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతాయని భావించే ఈ ఇద్దరు నేతలు ముందస్తుగా ఈ నిర్ణయాలు తీసుకున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాలపై నెటిజన్స్ స్పందించారు. ‘సీఎంలు తమ ఓటమిని ముందే పసిగట్టారా?’ అంటూ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నారు.

