Mobile Popup Ad
Mobile Popup Ad

కాంగ్రెస్ ఎమ్మెల్యే పీఏ అరెస్ట్!

క‌లం, వెబ్ డెస్క్‌: యువ‌తిని పెళ్లి చేసుకుంటాన‌ని మోసం చేసిన కేసులో భూపాలపల్లి (Bhupalapally) ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ (Gandra Satyanarayana) పీఏ శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జ్యోతి అనే యువ‌తిని పెళ్లి చేసుకుంటాన‌ని న‌మ్మ‌బ‌లికి, శ్రీనివాస్ ఆమెను శారీర‌కంగా వాడుకున్నాడు. తాజాగా శ్రీనివాస్ వేరే అమ్మాయితో పెళ్లికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. జ్యోతి త‌న‌తో పెళ్లి గురించి అడ‌గ‌గా కులం పేరుతో దూషించి, పెళ్లికి నిరాక‌రించాడు. దీంతో జ్యోతి చిట్యాల పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు శుక్ర‌వారం శ్రీనివాస్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు న‌మోదు చేశారు. శ్రీనివాస్ ను నేడు అరెస్ట్ చేసి రిమాండ్‌కు త‌ర‌లించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>