ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన ‘దిష్టి’ వ్యాఖ్యలు ఎంతటి దుమారం రేపాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్రంలోని అధికార పక్షం, ప్రతిపక్షం, అటు ఏపీలోని ప్రతిపక్షం మూకుమ్మడి దాడికి తెగబడ్డాయి. పవన్ కల్యాణ్(Pawan Kalyan) వెంటనే క్షమాపణ చెప్పాలని తెలంగాణ మంత్రులు డిమాండ్ చేశారు. లేదంటే పవన్ సినిమాలు ఇక్కడ ఆడనివ్వబోమంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఈ అంశం జనసైనికులకు (Janasainiks) ఇబ్బందికరంగా మారింది. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను వక్రీకరించారని.. ఆయనకు తెలంగాణ ప్రజల మీద ఎటువంటి ద్వేషం, కోపం లేవని.. వారు ఎంత మొత్తుకున్నా ఇక్కడి నేతల నుంచి విమర్శలు ఆగలేదు.
అయితే ఈ అంశంలో చాలా ఘాటుగా స్పందించింది మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komatireddy). ఆయన సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్ మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన ఆయన అనుచరుడు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సైతం చాలా ఘాటుగా స్పందించారు. తెలంగాణ రాష్ట్రంలోనూ పవన్ కల్యాణ్‌కు అభిమాన గణం ఉంది. దీంతో వారికి కూడా ఈ అంశం ఇబ్బందికరంగా మారింది. ఈ క్రమంలో జనసైనికులు (Janasainiks) కోమటిరెడ్డిని టార్గెట్ చేశారు. కోమటిరెడ్డి తమ అధినేత వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుని అందరినీ తప్పుదోవ పట్టించారని జనసైనికులు ఆరోపించారు. ఆయన గతంలో మాట్లాడిన వివాదస్పద వ్యాఖ్యల వీడియోలను బాగా వైరల్ చేస్తున్నారు. మరోవైపు కోమటిరెడ్డి అనుచరులు సైతం పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేస్తున్నారు. ఇలా సోషల్ మీడియాలో ఇంకా రచ్చ కొనసాగుతోంది.
అయితే ఈ వివాదాన్ని పవన్ కల్యాణ్ లైట్ తీసుకున్నట్టు కనిపిస్తోంది. రెండు మూడు రోజులైతే వివాదం సద్దుమణుగుతుందని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా కోనసీమ రైతులను ఉద్దేశించి పవన్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారానికే దారి తీశాయి. ఇప్పట్లో పవన్ కల్యాణ్ సినిమాలు విడుదలకు కూడా సిద్ధంగా లేవు. ఆయన చిత్రాలు విడుదలయ్యే సమయానికి ఈ వివాదం మొత్తం సద్దుమణుగుతుందేమో వేచి చూడాలి.
Read Also: హిడ్మా ఎన్ కౌంటర్ బూటకం.. మావోయిస్టు పార్టీ సంచలన లేఖ
Follow Us On: WhatsApp Channel


