Mobile Popup Ad
Mobile Popup Ad

బెంగాల్ ఎన్నికల్లో ‘లక్ష్మణరేఖ’.. 100 మీటర్ల దూరంలోనే…

కలం, వెబ్ డెస్క్ : పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో (Bengal Polls) హింస తలెత్తే అవకాశాలను అంచనా వేసిన కేంద్ర ఎన్నికల సంఘం అనేక జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నది. ఏ రాష్ట్రంలో లేనంతగా అక్కడకు 2500 కంపెనీల కేంద్ర భద్రతా బలగాలను తరలించింది. ఆ రాష్ట్రంలో భారీ స్థాయిలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ఎలక్షన్ కమిషన్ తరఫున ప్రత్యేక అబ్జర్వర్లను నియమించింది. మొత్తం ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ఒకేసారి షెడ్యూలు ఇచ్చినా ఒక్క వెస్ట్ బెంగాల్‌లో మాత్రమే రెండు ఫేజ్‌లలో పోలింగ్ నిర్వహిస్తున్నది. ఇదంతా ఒక ఎత్తయితే పోలింగ్ కేంద్రాల దగ్గర బహుళ అంచెల భద్రతా వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలోనే ‘లక్ష్మణరేఖ’ గీసింది. రాష్ట్రంలోని అన్ని పోలింగ్ బూత్‌ల దగ్గర ఈ లక్ష్మణరేఖల నిబంధన తప్పనిసరి. ఈ బౌండరీ లైన్ దగ్గరే పోలీసు సెక్యూరిటీ, ఎలక్షన్ డ్యూటీ స్టాఫ్ ఉంటారు. బూత్ లెవల్ ఆఫీసర్, ప్రభుత్వ సిబ్బంది ఓటరు దగ్గరున్న గుర్తింపు కార్డు, ఎలక్షన్ స్టాఫ్ సప్లై చేసిన ఓటర్ స్లిప్.. ఇలాంటివాటిని వెరిఫై చేస్తారు. దీన్ని ‘ఫస్ట్ రౌండ్ చెకప్’గా ఎలక్షన్ కమిషన్ భావిస్తున్నది.

అన్నీ సక్రమంగా ఉంటేనే ‘లక్ష్మణరేఖ’ దాటాలి :

లక్ష్మణరేఖ పోలింగ్ బూత్‌కు ఒక సరిహద్దు. ఆ రేఖకు వెలుపల ఉండగానే ఓటర్ల పేర్లు జాబితాలో ఉన్నాయో లేవో వివరాలన్నింటి పరిశీలన పూర్తవుతుంది. అన్నీ సక్రమంగానే ఉన్నాయని ధృవీకరణ అయిన తర్వాతనే రేఖకు అటువైపు వెళ్ళడానికి భద్రతా బలగాలు అనుమతి ఇస్తాయి. ఆ రేఖ క్రాస్ చేసి వెళ్ళిన తర్వాత మళ్ళీ నాలుగైదు అంచెల్లో ఓటర్ల వివరాలను తెలుసుకునే ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. అందులో మొదట ఓటరు దగ్గరున్న ఓటరు గుర్తింపు (EPIC) కార్డును, దానికి తగిన వివరాలు ఓటర్ల లిస్టులో ఉన్నాయో లేవో పరిశీలన జరుగుతుంది. మొత్తం నాలుగు అంచెల్లో ఇలాంటివాటిని పోలింగ్, సెక్యూరిటీ స్టాఫ్ పరిశీలిస్తారు. అన్నీ సక్రమంగా ఉన్నాయని రూఢీ అయిన తర్వాత వారు పోలింగ్ బూత్‌లోకి వెళ్లేందుకు అనుమతి లభిస్తుంది. అక్కడకు వెళ్ళిన తర్వాత మార్కింగ్ చేయడం, మిగిలిన ప్రాసెస్ అంతా యథావిధిగా కంటిన్యూ అవుతుంది.

Read Also: చంద్రబాబుపై సీఎం రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>