epaper
Monday, February 23, 2026
epaper

సౌత్ డైరెక్టర్లపై హీరోయిన్ తాప్సీ సంచలన వ్యాఖ్యలు

కలం, డెస్క్ : హీరోయిన్ తాప్సీ (Taapsee) మరోసారి సంచలన కామెంట్లు చేశారు. తనను షూటింగ్ సెట్స్ లో ప్యాడెడ్ బ్రా వేసుకోమని చాలా మంది సౌత్ ఇండియా డైరెక్టర్లు ప్రెషర్ చేశారని బాంబు పేల్చింది. తన ప్రైవేట్ పార్టులపై తప్పుగా మాట్లాడేవారని.. ప్యాడెడ్ బ్రా వేసుకుని ఎక్స్ పోజ్ చేయాలంటూ ఒత్తిడి చేశారని సంచలన ఆరోపణలు చేసింది. ఆమె నటించిన లేటెస్ట్ మూవీ అస్సీ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తాప్సీ ఇలాంటి కామెంట్లు చేసింది.

‘సౌత్ లో నేను చాలా సినిమాల్లో డైరెక్టర్ల వల్ల ఇబ్బంది పడ్డాను. నన్ను ప్యాడెడ్ బ్రా వేసుకోమని కొందరు డైరెక్టర్లు చెప్పారు. ఆ విషయం నేరుగా చెప్పకుండా వేరే వాళ్లతో చెప్పించిన ఘటనలు కూడా ఉన్నాయి. అది విని నేను చాలా ఇబ్బంది పడ్డాను. ఇలా కూడా ఉంటారా అనుకునేదాన్ని. ముఖ్యంగా సాంగ్స్ చేసేటప్పుడు అలాంటి బ్రాలు వేసుకోవాలని కండీషన్లు పెట్టేవారు. వందల మందిలో అలాంటివి వేసుకోవడం నిజంగా ఇబ్బందిగానే అనిపిస్తుంది’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది తాప్సీ (Taapsee). గతంలో కూడా ఆమె తెలుగు డైరెక్టర్లపై ఇలాంటి కామెంట్లే చేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>