epaper
Wednesday, February 18, 2026
epaper

త్వ‌ర‌లో కేటీఆర్ జైలుకు వెళ్తాడు: నాయిని రాజేందర్ రెడ్డి

క‌లం, వెబ్ డెస్క్‌: కేటీఆర్ త్వ‌ర‌లో జైలుకు వెళ్తాడ‌ని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి (Naini Rajender Reddy) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. హ‌న్మ‌కొండ జిల్లాలో కేటీఆర్(KTR) చేసిన వ్యాఖ్య‌ల‌పై నాయిని నేడు స్పందించారు. క‌బ్జా చేసిన బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌లో ప్రెస్‌మీట్ పెట్టి కేటీఆర్ మాట్లాడ‌టం దొంగే దొంగా అని అరిచిన‌ట్లు ఉంద‌ని విమ‌ర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపో మాపో జైలుకు వెళ్లాల్సిన కేటీఆర్ ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నాడ‌ని మండిప‌డ్డారు. కేటీఆర్ బుద్ధి మార‌ద‌ని, నోటికి వ‌చ్చిన‌ట్లు మాట్లాడుతున్నాడ‌ని విమ‌ర్శించారు. కేటీఆర్‌తో స‌హా కుటుంబం మొత్తం చ‌ర్ల‌ప‌ల్లి జైలుకు పోతార‌ని వ్యాఖ్యానించారు. గ‌తంలో న‌యీం న‌గ‌ర్ బ్రిడ్జిపై కూర్చొని రూ.10 వేలు ఇస్తామ‌ని చెప్పి ఏం చేశార‌ని ప్ర‌శ్నించారు. హ‌న్మ‌కొండ‌ను ఆరు ముక్క‌లు చేసి స‌ర్వ నాశ‌నం చేశార‌ని ఆరోపించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ చేయ‌ని అరాచ‌కం లేద‌న్నారు. రేవంత్ రెడ్డి ముఖ్య‌మంత్రి అయిన‌ప్ప‌టి నుంచి ఎందుకు జీర్ణించుకోలేక పోతున్నార‌ని విమ‌ర్శించారు. కేటీఆర్‌, హ‌రీశ్‌రావును ఊర్ల‌ల్లోకి వెళ్తే త‌రిమికొడుతున్నార‌ని, ఇంకా మార‌క‌పోతే ఎలా అని సెటైర్లు వేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>