Mobile Popup Ad
Mobile Popup Ad

మీ ఎస్పీకి ఎందుకు అంత కోపం? కార్యకర్తలను బస్కీలు తీయిస్తాడా?.. బండి సంజయ్ ఆగ్రహం

కలం, కరీంనగర్ డెస్క్: ఒక కేంద్ర మంత్రి జిల్లాకు వచ్చినప్పుడు స్థానిక ఎస్పీ హాజరుకాకపోవడంపై బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిసిల్ల (Sircilla) జిల్లాలోని కుసుమ రామయ్య ప్రభుత్వ పాఠశాలలో “మన బడి – మన బాధ్యత” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మహేష్ బి. గీతె హాజరు కాకపోవడంపై బండి సంజయ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ” మీ ఎస్పీకి ఎందుకు అంత కోపం? కార్యకర్తలను బస్కీలు తీయిస్తాడా? బీఆర్‌ఎస్ పై ఎందుకంత ప్రేమ చూపిస్తుండు, కార్యకర్తలు అనుకుంటుండా.. ఇంకేమన్న అనుకుంటుండా” అని ఆయన అక్కడున్న డీఎస్పీని ప్రశ్నించారు.

Read Also: భారీ వర్షాలు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>