అంతర్గాంలో అంగన్‌వాడీ భవనం ప్రారంభం

కలం, జగిత్యాల: జగిత్యాల రూరల్ మండలం అంతర్గాం(Anthergoan) గ్రామంలో నూతనంగా నిర్మించిన అంగన్‌వాడీ కేంద్రం–2 భవనాన్ని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ (MLA Sanjay Kumar) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారులకు మెరుగైన వాతావరణంలో పౌష్టికాహారం, ప్రాథమిక విద్య, ఆరోగ్య సేవలు అందించడంలో అంగన్‌వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.

అంతర్గాంలో రూ.12 కోట్లతో తెలంగాణ పబ్లిక్ స్కూల్

రాష్ట్రంలో మెడికల్ కాలేజీ, ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. అంతర్గాం గ్రామంలో రూ.12 కోట్లతో తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరైనట్లు వెల్లడించారు. జగిత్యాల–అంతర్గాం, లింగంపేట–అంతర్గాం ప్రాంతాల్లో రైల్వే అండర్‌పాస్‌ల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నారని, వి.బి. గ్రామీణ అభివృద్ధి పథకం కింద నియోజకవర్గానికి రూ.100 కోట్ల నిధులు మంజూరు చేస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే వివరించారు.

అంగన్‌వాడీ భవనాల మంజూరుకు కృషి

జగిత్యాల నియోజకవర్గంలో మరిన్ని అంగన్‌వాడీ భవనాల మంజూరుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తెలిపారు. చిన్నారులకు నాణ్యమైన సేవలు అందించేందుకు అంగన్‌వాడీ కేంద్రాల్లో అవసరమైన వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణపై అవగాహన అవసరమని, ప్రజలు తమ వంతు కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఎల్‌నినో ప్రభావాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఇంటి వద్ద పక్షుల కోసం నీటి తొట్టెలు ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యుత్‌, నీటిని పొదుపుగా వినియోగిస్తూ ప్రకృతి వనరులను కాపాడుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నోముల రమ్య–శేఖర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ గడ్డం నారాయణరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు కొలుగూరి దామోదర్ రావు, సందీప్ రావు, ఎంపీడీవో రమాదేవి, తహసీల్దార్ హకీమ్, సీడీపీవో జయప్రద, ఏసీడీపీవో రాజేశ్వరి, సూపర్‌వైజర్ మమత, ఏఈ విజయ్, ఉప సర్పంచ్ బాలు గౌడ్, బోనగిరి నారాయణ, సర్పంచుల ఫోరం ప్రతినిధులు బొలిశెట్టి గంగారెడ్డి, కట్ట రాజేందర్, మండల పార్టీ అధ్యక్షుడు బాల ముకుందం, మాజీ జడ్పీటీసీ పెండెం రాములు, ఏఎంసీ డైరెక్టర్ రాజిరెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ రాజయ్య, ఎంపీఓ రవి బాబు, మాజీ ఎంపీటీసీ రాజిరెడ్డి, ములసపు మహేష్, పడిగేల స్వామిరెడ్డి, స్వామిరెడ్డి సతీష్, అరుణ్, వార్డు సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, అంగన్‌వాడీ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>