తుఫాన్ ముప్పు.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

కలం, వెబ్ డెస్క్: అర్నబ్ తుఫాన్ (Arnab Cyclone) ముప్పు పశ్చిమ గోదావరి నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు ఉంటుందని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రస్తుతం తీరానికి 110 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని.. తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. సముద్రం పోటు పెరిగి 120 మీటర్ల వరకు అలలు ఎగిసి పడుతున్నాయని తెలిపారు. ప్రజలు బయటకు రావొద్దని.. ప్రయాణాలు మానుకోవాలని సూచించారు. వర్షాలు, ఈదురు గాలులు ఎక్కువగా వీస్తాయన్నారు.

కృష్ణా జిల్లాపై అధిక ప్రభావం ఉంటుందని.. కోనసీమ, కాకినాడ, ఉభయ గోదావరి జిల్లాల్లో తుఫాన్ ప్రభావం ఉంటుందన్నారు. కాకినాడ జిల్లాలో 21 గ్రామాలను ముంపు ప్రాంతాలుగా నిర్ణయించి.. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు వివరించారు. తుఫాన్ కారణంగా ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా చూస్తున్నామని వివరించారు. నేవీ, కోస్ట్ గార్డ్ టీంలను కూడా అలర్ట్ చేశామన్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

నిత్యాసవరాలపై సమీక్ష..

నిత్యావసరాలకు ప్రజలు ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ మేరకు ఉన్నతాధికారులతో సమీక్ష చేపట్టారు. తక్కువ ధరలకే సరుకులు అందించాలన్నారు. ధరణి బ్రాండ్ బియ్యం సరఫరాను మరింత విస్తరించాలన్నారు. మొబైల్ వాహనాల ద్వారా ప్రజలకు పంపిణీ చేయాలన్నారు. కిలో ఫైన్ రైస్ రూ.49కే అందించాలన్నారు. దీపావళి నాటికి సరుకుల సరఫరా ప్రారంభించాలని.. కర్నూల్ నుంచి ఉల్లి సరఫరా మరింత పెరిగేలా చూడాలన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>