కలం, మెదక్ బ్యూరో : తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై అఖిలపక్ష సమావేశం (All Party Meeting) నిర్వహించబోతున్నమని, రాష్ట్రానికి రావలసిన నిధుల కోసం ప్రతిపక్ష నాయకులను కూడా కలుపుకుని త్వరలోనే ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలవనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) తెలిపారు. ఎల్ నినో ప్రభావం, వర్షాభావ పరిస్ధితులతో రాబోయే రోజుల్లో నీటి ప్రాజెక్టులన్నీ ఎండిపోయే ప్రమాదం ఉందని, ఈ దృష్ట్యా రైతులు కరువు పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రెండో పంట వేయవద్దని, రైతులు ఎంతో అనుభవజ్ఞులని ప్రతిపక్షాలు కూడా కరువును రాజకీయం చేయకుండా ఉన్న వాస్తవాలను రైతులకు వివరించాలని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు.
సంగారెడ్డిలో ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజాపాలన సమీక్షా సమావేశం లో సహచర మంత్రులు దామోదర రాజనర్సింహ, వివేక్ వెంకటస్వామితో కలిసి పాల్గోన్నాడు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti) మీడియాతో మాట్లడుతూ.. గత ప్రభుత్వ ధరణి పోర్టల్‌ను పక్కనబెట్టి, రైతుల సంక్షేమం కోసం ‘భూ భారతి’ విధానాన్ని తీసుకొచ్చామని తెలిపారు. సుమారు 125 సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో మళ్లీ సమగ్ర భూ రీ-సర్వే చేపట్టినట్లు చెప్పారు.ఇప్పటివరకు 380 గ్రామాల్లో భూ సర్వే పూర్తిచేసి, ఆయా రైతులు/యజమానులకు భూ హక్కు పత్రాలను పంపిణీ చేశాం. మరో 900 గ్రామాల్లో సర్వే తుది దశకు చేరుకుందన్నారు. రాబోయే ఏడాదిన్నరలోగా తెలంగాణవ్యాప్తంగా భూ సర్వే ప్రక్రియను పూర్తిగా పూర్తి చేస్తామని అన్నారు.
భవిష్యత్ తరాలకు వివాదరహిత భూములను అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, ఆధార్ కార్డు తరహాలోనే భూములకు కూడా ‘భూదార్ (Bhudhaar)’ తీసుకురాబోతున్నామని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇండ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల విడుదల ఆలస్యమైనప్పటికీ, తాజాగా కేంద్రం 2 లక్షల ఇండ్లను మంజూరు చేసిందని చెప్పారు. గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేవలం బొమ్మలకే పరిమితమయ్యాయని విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేదవాడికి పూర్తి రక్షణ కల్పిస్తూ, సంక్షేమ పథకాలను పారదర్శకంగా అందిస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.
Also Read : దేశద్రోహ శక్తుల కుట్రలను తిప్పికొట్టాలి: బండి సంజయ్
Follow Us On : WhatsApp

