కల్లెడలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ స్పేర్ పార్ట్స్ చోరీ.. గ్రామస్తుల్లో ఆందోళన!

కలం, జగిత్యాల : జగిత్యాల రూరల్ మండలం కల్లెడ (Kalleda) గ్రామ పరిధిలోని రిజర్వ్ ఫారెస్ట్ సమీపంలో విద్యుత్ సరఫరా ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ స్పేర్ పార్ట్స్ చోరీకి (Transformer Spare Parts Theft) గురికావడం స్థానికంగా కలకలం రేపింది. విద్యుత్ సరఫరా కొనసాగుతున్న ట్రాన్స్‌ఫార్మర్‌‌లోని స్పేర్ పార్ట్స్ దొంగలు ఎత్తుకెళ్లడం విద్యుత్ శాఖ అధికారులతో పాటు గ్రామ ప్రజలు, రైతులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. విద్యుత్ సరఫరా ఉన్నప్పటికీ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఎలా తొలగించారు..? ఈ ఘటనకు పాల్పడిన వారు ఎవరు..? అనే ప్రశ్నలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి.

విద్యుత్ సరఫరా ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ స్పేర్ పార్ట్స్ చోరీ ఎలా..? సాధారణంగా విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను తొలగించాలంటే విద్యుత్ కనెక్షన్, పరికరాలను నిర్వహించే విషయంలో సాంకేతిక పరిజ్ఞానం అవసరం. అలాంటిది విద్యుత్ సరఫరా ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ స్పేర్ పార్ట్స్ చోరీకి గురైందనే విషయం స్థానికులను విస్మయానికి గురిచేస్తోంది. ఈ ఘటనలో ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏ విధంగా తొలగించారు..? విద్యుత్ సరఫరాను ఎలా నిలిపివేశారు..? చోరీకి ఎంత సమయం పట్టింది..? నిందితులు ఎంతమంది ఉన్నారు..? అనే అంశాలపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది.

జగిత్యాల రూరల్ పోలీసుల నిఘాపై మండల ప్రజల్లో చర్చ…!

జగిత్యాల రూరల్ మండల పరిధిలో జరిగిన ఈ ఘటనతో పోలీసుల నిఘా, రాత్రివేళల్లో పర్యవేక్షణపై గ్రామస్తులు, రైతులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. రిజర్వ్ ఫారెస్ట్ సమీపంలో ఉన్న విద్యుత్ పరికరాంలోని స్పేర్ పార్ట్స్ చోరీకి గురికావడంతో దొంగతనాలను అరికట్టేందుకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా కొనసాగుతోందా, అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విద్యుత్ పరికరాల చోరీలు రైతులకు ఆర్థికంగా నష్టం కలిగించడమే కాకుండా సాగునీటి సరఫరాకు అంతరాయం కలిగించే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు, విద్యుత్ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్థానికులు కోరుతున్నారు.

దర్యాప్తుతోనే అసలు విషయాలు వెలుగులోకి…!

కల్లెడ గ్రామ పరిధిలో ట్రాన్స్‌ఫార్మర్‌ స్పేర్ పార్ట్స్ చోరీ ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ చేపట్టాలని గ్రామస్తులు, రైతులు కోరుతున్నారు. ఘటనాస్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించడం, సమీప ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించడం, చోరీకి గురైన ట్రాన్స్‌ఫార్మర్‌ వివరాలను నమోదు చేసుకోవడం వంటి చర్యల ద్వారా నిందితులను గుర్తించే అవకాశం ఉంది. అలాగే గతంలో ఈ ప్రాంతంలో ఇలాంటి ఘటనలు ఏమైనా జరిగాయా అనే కోణంలోనూ పరిశీలించాల్సిన అవసరం ఉంది.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>