Mobile Popup Ad
Mobile Popup Ad

అర్హులకు ప్రభుత్వ పథకాలు అందేలా కృషి: జగిత్యాల డీఆర్డీవో

కరీంనగర్, కలం బ్యూరో: జగిత్యాల (Jagtial) జిల్లాలో మండల, గ్రామ మహిళా సంఘాల ప్రతినిధులు ప్రభుత్వ పథకాలను అర్హులైన వారికి అందేలా కృషి చేయాలని జిల్లా గ్రామీణభివృద్ధి శాఖ అధికారి ఎం.రఘువరణ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని మహిళా సమాఖ్య సమావేశ మందిరంలో జరిగిన మొదటి సమావేశానికి రఘువరన్ హాజరయ్యారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ.. జిల్లాలో 141 ఐకేపీ కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 13.50 లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. కొనుగోలు కేంద్రాల్లో అంకింతభావంతో పనిచేసిన ఏపీఎం, సీసీ, కమిటీ సభ్యులకు, వీఏఓలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

342 గ్రామ సమాఖ్య భవనాల నిర్మాణం..

జగిత్యాల జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద 342 గ్రామ సమాఖ్య భవనాలు మంజూరైనట్లు డీఆర్డీవో రఘువరణ్ తెలిపారు. సమాఖ్య సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి త్వరితగతిన పూర్తి చేయాలని సంఘాల్లో చేరని వారిని చేర్పించాలని సూచించారు. స్నేహ సంఘాలు ఏర్పాటు చేయాలని, ప్రతి మండల సమాఖ్యకి ఆర్టీసీ బస్సులు వస్తున్నాయని, ప్రతి నెల ఒక్కో మండలానికి ప్రభుత్వం అద్దె కూడా చెల్లిస్తుందని తెలిపారు. జెండర్ రోసార్స్ సెంటర్స్, సీఎంటీసీ కేంద్రాలు, స్త్రీనిధి రుణాలు, బకాయిలపైనా చర్చించారు. జిల్లా అదనపు ప్రాజెక్టు అధికారి పి.సునీత మాట్లాడుతూ.. బ్యాంక్ లింకేజీ రూ.793.74 కోట్ల రుణాలు లక్ష్యంగా విధించినట్లు తెలిపారు. ఈ సందర్బంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా పర్యావరణ పరిరక్షణ, చెత్త సేకరణ పై అవగాహన కల్పించి ప్రత్యేక పోస్టర్లు, కర పత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా డీపీఎంలు నారాయణ, నాగేశ్వర్ రావ్, స్త్రీ నిధి ఆర్‌ఎం నారాయణ, జిల్లా ఎస్బీఎం కో–ఆర్డినేటర్ హరిణి, జిల్లా ఎపీఎంలు వి. గంగాధర్, త్రివేణి , హుస్సేన్, చక్రవర్తి, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు డి. సరోజ, కార్యదర్శి ఆమని, జిల్లా సమాఖ్య సిబ్బంది ఆర్. భాగ్య, రవి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>