Mobile Popup Ad
Mobile Popup Ad

కేంద్రీయ విద్యాలయానికి స్థలం ఫిక్స్ : మంత్రి లక్ష్మణ్

కలం, కరీంనగర్ బ్యూరో : జగిత్యాలకు మంజూరైన కేంద్రీయ విద్యాలయానికి నర్సింగాపూర్ శివారులోని సర్వే నెంబర్ 437లో స్థలం కేటాయించినట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ (Adluri Laxman) తెలిపారు. మంగళవారం జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తో కలిసి నర్సింగాపూర్ లోని కేంద్రీయ విద్యాలయానికి కేటాయించనున్న స్థలాన్ని మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన చేసి ముందుకు సాగుతున్నారని మంత్రి తెలిపారు.

జగిత్యాలకు మంజూరైన కేంద్రీయ విద్యాలయాన్ని నర్సింగాపూర్ గ్రామంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. ఇందుకోసం 6 ఎకరాల స్థలాన్ని సర్వే నెంబర్ 437లో కేటాయిస్తున్నట్లు మంత్రి వివరించారు. ఇప్పటికే రూ. 33 కోట్లతో ఐటిఐ, ఈ ఏటీసీ సెంటర్ ను ఇక్కడ ఏర్పాటు చేశామని, వృద్ధాశ్రమం సైతం ఇక్కడే ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వివరించారు. కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుతో ఈ ప్రాంతం ఎడ్యుకేషన్ హబ్ గా మారుతుందని మంత్రి తెలిపారు. చల్ గల్ లోని వ్యవసాయ పరిశోధనకు సంబంధించిన వాలంటరీ భూములను 12 ఎకరాలు కేంద్రీయ విద్యాలయానికి, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కి కేటాయించడం జరిగిందని మంత్రి పేర్కొన్నారు.

కేంద్రీయ విద్యాలయానికి రెండు ఎకరాల స్థలం సరిపోదనే వివాదం నేపథ్యంలో నర్సింగాపూర్ లో ప్రభుత్వ భూమి కేటాయిస్తున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర రైతుల ప్రయోజనాల కోసం చల్ గల్ లో మరిన్ని వ్యవసాయ పరిశోధనలు జరగాల్సిన నేపథ్యంలో, వ్యవసాయ పరిశోధనల భవిష్యత్తు అవసరాల కోసం అక్కడి భూములను అంతకు మించి కేటాయించే అవకాశం లేదని మంత్రి తెలిపారు. నర్సింగాపూర్ భూముల ప్రతిపాదనలు జిల్లా అధికారుల ద్వారా కేంద్రీయ విద్యాలయ అధికారులకు పంపించడం జరుగుతుందని, ఇందుకోసం నిజామాబాద్ ఎంపీ అరవింద్ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సహకరించాలని మంత్రి కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>