కలం, వెబ్ డెస్క్ : సంగారెడ్డి మున్సిపల్ పోలింగ్ (Sangareddy Municipal Polls) వేళ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కాంగ్రెస్ కార్యకర్త కాలర్ పట్టుకున్నారంటూ పోలీసులపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jagga Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 34 వ వార్డు అభ్యర్థిని అడ్డుకున్న సీఐ.. కాలర్ పట్టుకున్నారంటూ ఆరోణల నేపథ్యంలో గొడవ మొదలైంది. ఈ విషయం తెలుసుకున్న జగ్గారెడ్డి పోలింగ్ బూత్ దగ్గరకు చేరుకుని సీఐ తీరుపై ఫైర్ అయ్యారు. పోలింగ్ ఆపెస్తానంటూ బూత్ లోకి వెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులకు, కాంగ్రెస్ శ్రేణులకు తీవ్ర ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా.. జగ్గారెడ్డి వినకుండా ఘాటు వ్యాఖ్యలు చేశారు.
‘రిగ్గింగ్ చేస్తున్నారని చెబితే మా అభ్యర్థిపై సీఐ గల్లా పట్టుకున్నాడు. ఆ సీఐ మొగుడు అయితే ఇక్కడికి రావాలి. జగ్గారెడ్డి (Jagga Reddy) ఎవరు అని అడుగుతారా? హోంగార్డులు ఎవర్రా మీరు. సంగారెడ్డిలో లా అండ్ దెబ్బతింటే దానికి కారణం సీఐ శివకుమార్, హోం గార్డులే కారణం’ అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Read Also: రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉందా? : కిషన్ రెడ్డి
Follow Us On: X(Twitter)


