ప్రవాసాంధ్రులను వెంటనే వెనక్కు తీసుకురావాలి : మాజీ సీఎం జగన్

కలం, డెస్క్ : ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్-అమెరికా యుద్ధం నేపథ్యంలో ఇండియాలో ఆందోళనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే గల్ఫ్ దేశాల్లో ఎక్కువగా ఇండియన్లు అందులోనూ తెలుగువారే ఉంటారు. తాజా ఆందోళనలపై మాజీ సీఎం జగన్ (YS Jagan) రియాక్ట్ అయ్యారు. గల్ఫ్ దేశాల్లో అలాగే ఇజ్రాయెల్ లో ఉన్న తెలుగు వారిని వెంటనే సురక్షితంగా వెనక్కు తీసుకురావాలని కోరారు. గల్ఫ్ దేశాల్లో (Gulf Countries) వేలాది మంది ఏపీ వాసులు ఉన్నారు. కేంద్రంతో ఏపీ ప్రభుత్వం సమన్వయం చేసుకుని వారందరినీ వెనక్కు తీసుకురావాలన్నారు జగన్.

‘ఇలాంటి సంక్షోభ సమయంలో రాజకీయాలు పక్కన పెట్టిపనిచేయాలి. గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయిన ఆంధ్రుల వివరాలను ఎప్పటికప్పుడు వారి కుటుంబీకులకు తెలియజేయాలి. ఇందుకోసం స్పెషల్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేయాలి. ఆ హెల్ప్ లైన్ నెంబర్లను అందరికీ తెలిపేలా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది’ అంటూ చెప్పుకొచ్చారు జగన్ (Jagan). గల్ఫ్ దేశాల్లో ఉన్న ఇండియన్ ఎంబసీ అక్కడ ఉన్న భారతీయులను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూనే ఉంది. వారికి అవసరం అయిన అన్ని సహాయాలను అందిస్తున్నట్టు అటు కేంద్రం కూడా స్పష్టం చేసింది.

Read Also: గరికపాటి అధిక ప్రసంగాలు చేయొద్దు: కమలానంద భారతి

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>