కలం, హనుమకొండ : తెలంగాణలో సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని జనసేన పార్టీ వరంగల్ జిల్లా, నర్సంపేట నియోజకవర్గ నాయకుడు మేరుగు శివకోటి యాదవ్ ఆరోపించారు. జనసేన పార్టీ వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో బుధవారం హనుమకొండ (Hanamkonda)లోని అదాలత్ అమరవీరుల స్తూపం వద్ద ధర్నా నిర్వహించారు.
విద్యార్థులకు పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని, 22-ఏ పరిధిలో ఉన్న పేదల భూముల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, రైతులకు సాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరారు.

