అభిమానులమని ఇంట్లోకి వచ్చి.. జబర్దస్త్ నటుడిపై దాడి !

కలం, వెబ్ డెస్క్ : మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రముఖ టీవీ ఆర్టిస్ట్, ‘జబర్దస్త్’ (Jabardasth) ఫేమ్ కొమురక్క (Komurakka) పై దాడి జరిగింది. బాలానగర్ మండలం ఉడిత్యాల గ్రామంలోని ఆయన స్వగ్రామంలో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. అభిమానులమని నమ్మించి వచ్చిన సుమారు ఎనిమిది మంది వ్యక్తులు ఈ దాడికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది.

ఈ వివాదానికి ప్రధాన కారణం గతంలో కొమురక్క ఇంట్లో జరిగిన బంగారం చోరీగా తెలుస్తోంది. తన అసిస్టెంట్ శ్రీనాథ్ ఆ దొంగతనానికి పాల్పడినట్లు గతంలోనే అంగీకరించినప్పటికీ, పోగొట్టుకున్న బంగారాన్ని మాత్రం తిరిగి ఇవ్వలేదు. దీనిపై రెండు రోజుల క్రితం కొమురక్క అతడిని మరోసారి తీవ్రంగా మందలించారు. ఈ విషయాన్ని మనసులో పెట్టుకున్న శ్రీనాథ్, తన స్నేహితులకు సమాచారం ఇచ్చాడు.

మంగళవారం రాత్రి శ్రీనాథ్ తన స్నేహితులతో కలిసి కొమురక్క (Komurakka) ఇంటికి చేరుకున్నారు. తన స్నేహితుడిని ఎందుకు తిట్టావంటూ గొడవకు దిగి, ఒక్కసారిగా రాళ్లు, కర్రలతో దాడికి తెగబడ్డారు. ఈ క్రమంలో కొమురక్కతో పాటు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులు వెంటనే పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.

Read Also: ఫేస్‌బుక్ ప్రేమ పెళ్లి విషాదాంతం: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>