ఏసీ అతి వాడకంతో ఆరోగ్యానికి ముప్పు.. ఈ జాగ్రత్తలు మస్ట్!

కలం, వెబ్ డెస్క్: వేసవి (Summer) తీవ్రతను తట్టుకోవడానికి చాలామంది ఏసీలపైనే (AC) ఆధారపడుతున్నారు. అయితే ఏసీల అధిక వినియోగం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏసీ గదుల్లో ఎక్కువ సేపు గడపడం వల్ల గాలిలోని తేమ తగ్గి చర్మం పొడిబారడం, కళ్లు ఎర్రబడటం, దురద వంటి సమస్యలు వస్తాయి. అలాగే గదుల్లో సరైన గాలి వెలుతురు లేకపోవడం వల్ల బ్యాక్టీరియా, వైరస్‌లు పేరుకుపోయి శ్వాసకోస సంబంధిత వ్యాధులు, అలర్జీలు, ఆస్తమా వంటి సమస్యలు తీవ్రమయ్యే ప్రమాదం ఉందని వైద్యులు చెప్తున్నారు.

మరోవైపు ఎండలో నుండి నేరుగా చల్లటి ఏసీ (AC) గదిలోకి ప్రవేశించడం, ఏసీ గది నుండి బయటకు వెళ్లడం వల్ల శరీర ఉష్ణోగ్రతలో వచ్చే ఆకస్మిక మార్పులు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. దీనివల్ల కండరాల నొప్పులు, కీళ్లు, తీవ్రమైన తలనొప్పి వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఏసీ ఫిల్టర్లను క్రమం తప్పకుండా శుభ్రం చేయకపోతే, అవి ప్రమాదకరమైన సూక్ష్మజీవులకు నిలయంగా మారి ఇన్‌ఫెక్షన్లకు దారితీస్తాయి. అందుకే ఏసీని తక్కువగా తగిన జాగ్రత్తలతో వాడటం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>