Mobile Popup Ad
Mobile Popup Ad

సెన్సస్‌లో సమాచారం ఇవ్వకపోతే ఫైన్ : డైరెక్టర్ భారతి హోలికేరి

కలం, వెబ్ డెస్క్: జనాభా లెక్కలు (సెన్సస్) -2027(Census 2027) లో భాగంగా ప్రజలు ఎమ్యూనరేటర్లకు సహకరించాలని సెన్సస్ డైరెక్టర్ భారతి హోలికేరి పేర్కొన్నారు. ఎవరైనా సమాచారం ఇచ్చేందుకు నిరాకరిస్తే రూ. 1000 ఫైన్ వేస్తామని చెప్పారు. 16 ఏళ్ల తర్వాత దేశంలో జనగణన జరుగుతోందని చెప్పారు. జనాభా లెక్కల నిర్వహణపై శనివారం సెన్సర్ డైరెక్టర్ భారతి హోలికేరి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సెన్సెస్ అద్దంలా ఉండాలని చెప్పారు. అన్ని సర్వేలకు సెన్సస్ మదర్ లాంటిదని అభివర్ణించారు. ప్రజలు సహకరిస్తేనే ఈ కార్యక్రమం సక్సెస్ అవుతుందని పేర్కొన్నారు. మన దేశంలో జరగబోయే సెన్సెస్ లకు ఇతర సర్వేలకు ఎంతో భిన్నంగా ఉంటుందన్నారు. ప్రపంచంలోనే మన సెన్సెస్ బిగ్గెస్ట్ ఎక్ససైజ్ అంటూ పేర్కొన్నారు.

కేంద్రానికి మాత్రమే అధికారం

సెన్సెస్ చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందన్నారు. 2021లో చేయాల్సిన సెన్సెస్ కరోనా వల్ల చేయలేకపోయామన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో 8వ సారి జనగణన జరుగుతోందని చెప్పారు. గ్రామస్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ఎలాంటి పాలసీ చేయాలన్న ప్రైమరీ సోర్స్ సెన్సెస్ అని పేర్కొన్నారు. ’ప్రాంతంలో ఏ అవసరం ఉంది.. పల్లెల నుంచి పట్టణాలకు మైగ్రేషన్ ఎలా ఉంది ? ఇలా అని తెలియాలన్నా సెన్సెస్ అవసరం

నియోజకవర్గాల పునర్విభజనలో కీలకం

నియోజకవర్గాల పునర్విభజన, రిజర్వేషన్ల కోసం జనగణన ఎంతో కీలకమన్నారు. ఈ ప్రక్రియకు చట్టబద్ధత ఉంటుందని చెప్పారు. సెల్ఫ్ ఎమ్యునరేషన్ చేసుకునే వెసులుబాటు ఉందన్నారు. ప్రజలంతా సెన్సెస్‌లో భాగస్వాములు కావాలని సూచించారు. ఎన్యూమరే సేకరించాల్సిన ప్రశ్నలు మాత్రమే అడగాలని స్పష్టం చేశారు.

ప్రైవసీకి ప్రాధాన్యం

ప్రజలు ఇచ్చిన సమాచారం గోప్యంగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సెక్షన్ 15 ప్రకారం సమాచారం డేటా గోప్యంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. ‘సెన్సెస్‌లో ఇచ్చిన సమాచారం కోర్టులో ఎవిడెన్స్ గా పనికిరాదు. ఈ ప్రక్రియలో భాగంగా సమాచారం సేకరించే అధికారులకు రక్షణ ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత జరుగుతున్న తొలి జనగణన ఇదే. కులగణన స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొదటిసారి. ’ అంటూ భారతి హోలికేరి పేర్కొన్నారు.

సెన్సస్ జరిగే తేదీలు ఇవే..

‘ఈ ఏడాది మే11 నుంచి జూన్ 9 వరకు మొదటి విడత (హౌసింగ్ సెన్సెస్ )నిర్వహిస్తారు. ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు సెల్ఫ్ ఎన్యూమరేషనర్ చేస్తారు. రెండోదశ 2027 ఫిబ్రవరి 9 నుంచి 28 వరకు నిర్వహిస్తారు. ఇల్లు లేని వాళ్ళ వివరాలను 28 ఫిబ్రవరి రోజు జరుగుతోంది. రివిసినల్ రౌండ్ మార్చ్ 1 నుంచి మార్చ్ 5 వరకు నిర్వహిస్తారు. ఇందులో పట్టణాల్లో, గ్రామాల్లో ఉన్న వనరులపై సమాచారాన్ని సేకరిస్తారు. పట్టణాల్లో 420 రకాల డేటా సేకరిస్తారు. గ్రామాల్లో 400 రకాల డేటా సేకరిస్తారు

మొదటి దశలో 33 ప్రశ్నలు

ఇందులో 1 నుంచి 14 వరకు ఉన్న ప్రశ్నలలో కింద ఇంటి యజమాని, ఇంటి పరిస్థితి వివరాలు అడుగుతారు. 15-24 ప్రశ్నలు ఇంట్లో ఉన్న వసతుల మీద అడుగుతారు. 25- 31 ప్రశ్నలు ఆస్తుల వివరాలు తెలుసుకుంటారు. 31 నుంచి 33 వరకు ఉన్న ప్రశ్నలు వారి ఆహార అలవాట్లను అడుగుతారు.
డిజిటల్ మెథడ్‌లో సెన్సెస్ నిర్వహిస్తారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>