Mobile Popup Ad
Mobile Popup Ad

అమెరికాకు షాక్.. ఇరాన్ మరో ప్రకటన..

కలం, వెబ్ డెస్క్ : ఇరాన్ కు అమెరికా 48 గంటల డెడ్ లైన్ విధించిన సంగతి తెలిసిందే. 48 గంటల్లోపు హర్మూజ్ జలసంధిని తెరవకుంటే భీకరంగా దాడులు చేస్తామని నిన్న ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ లోని (Iran) పవర్ ప్లాంట్లను టార్గెట్ చేసుకుంటామని.. ముందుగా అతిపెద్ద పవర్ ప్లాంట్ ను ధ్వంసం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. నిన్న ఇరాన్ కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. హర్మూజ్ తెరిచే ఉందని.. శత్రదేశాలకు మాత్రమే అక్కడ అనుమతి లేదని తేల్చి చెప్పింది. ఈ క్రమంలో ఇరాన్ మరో వార్నింగ్ ఇచ్చింది. తమ మీద దాడులు చేస్తే హర్మూజ్ జలసంధిని పూర్తిగా మూసి వేస్తామని తెలిపింది.

తమ దేశంలోని పవర్ ప్లాంట్లను ధ్వంసం చేస్తే హర్మూజ్ ఎప్పటికీ తెరుచుకోదని తేల్చి చెప్పింది. హర్మూజ్ నుంచి శత్రు దేశాలు తప్ప మిగతా అన్ని దేశాల నౌకలు వెళ్లొచ్చని ఇరాన్ స్పష్టం చేసింది. ఇరాన్ (Iran) ప్రకటనతో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన మొదలైంది. ఎందుకంటే ట్రంప్ నిజంగానే దాడులు చేయిస్తే.. ప్రపంచ దేశాలకు వెళ్తున్న నౌకలు కూడా ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. ఇరాన్ అమెరికాతో పాటు దాని శత్రుదేశాల నౌకలకు పర్మిషన్ ఇచ్చే అవకాశాలు కనిపించట్లేదు. మరి ఏం జరుగుతుందో రేపటి వరకు చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>