Mobile Popup Ad
Mobile Popup Ad

ట్రంప్ కు బిగ్ షాకిచ్చిన ఇరాన్ సుప్రీం లీడర్

కలం, వెబ్ డెస్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఇరాన్ (Iran) సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ బిగ్ షాకిచ్చారు. అణు పరీక్షలను నిలిపివేయాలని ఇరాన్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Trump) యుద్దానికి దిగిన వేళ ఇరాన్ సుప్రీం లీడర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ తన అణు, క్షిపణి సామర్థ్యాలను జాతీయ సంపదగా పరీరక్షించుకుంటుందని బాంబు పేల్చారు. ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ లో ఈ విషయాన్ని వెల్లడించారు. యుద్ధం సమసిపోయేందుకు ఇరాన్, అమెరికా మధ్య  చర్చలు జరుగుతున్న వేళ ఇరాన్ సుప్రీం లీడర్ చేసిన తాజా వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

అంతేకాదు హర్మూజ్ జలసంధిలో (Strait of Hormuz) అమెరికా అవమానకర వైఫల్యం చెందిందని అయతొల్లా అలీ ఖమేనీ ఆరోపించారు. ప్రస్తుతం హర్మూజ్ జలసంధిలో ఒక కొత్త అధ్యాయం ఆవిర్భవించిందని పేర్కొన్నారు. హర్మూజ్ జలసంధి టెహ్రాన్ పట్టులో ఉందని స్పష్టం చేశారు. పర్షియన్ గల్ఫ్ లో అమెరికన్ల ఏకైక స్థానం హర్మూజ్ జలసంధి జలాల అడుగున మాత్రమేనని ఎద్దేవా చేశారు. ఇరాన్, అమెరికా (Iran – Amercia) మధ్య యుద్ధం వల్ల హర్మూజ్ జలసంధి మూతపడి ప్రపంచ దేశాలకు చమురు రవాణా ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ చేసిన తాజా వ్యాఖ్యలు ఇరాన్, అమెరికా సంబంధాలలో మరింత ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉంది. దీంతో మళ్లీ ప్రపంచ దేశాలు తీవ్ర చమురు సంక్షోభాన్ని ఎదుర్కొనే పరిస్థితి రావొచ్చని ప్రపంచ ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Read Also: నాన్నకు ప్రేమతో.. తండ్రి ‘కల’ నెరవేర్చిన కొడుకు ‘కలం’..!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>