షూ వివాదం.. ఇరాన్ అథ్లెట్ డిస్క్వాలిఫై

కలం, స్పోర్ట్స్​ : ఆసియా క్రీడలు (Asian Games) 2026లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. పతకం సాధిస్తుందనుకున్న ఇరాన్ స్టార్ అథ్లెట్ ఫాతిమా మొహితిజాదె (Fatemeh Mohitizadeh) పై తీవ్ర అనర్హత వేటు పడింది. షూ నియమాలను ఉల్లంఘించడంతో నిర్వాహకులు ఆమెను పోటీ నుంచి తొలగించారు. శుక్రవారం జరిగిన హెప్టాథ్లాన్ లాంగ్ జంప్ విభాగంలో ఈ డ్రామా నడిచింది. మొదటి రోజు ఆట ముగిసేసరికి ఫాతిమా 3,486 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ప్రత్యర్థి కంటే దాదాపు 100 పాయింట్ల ఆధిక్యంలో ఉంది.

రెండో రోజు లాంగ్ జంప్ ఈవెంట్లో ఆమె లాంగ్ జంప్ షూస్‌కు బదులు స్ప్రింట్ స్పైక్స్ ధరించినట్లు తెలిసింది. దీనిపై ఇతర పోటీదారులు నిరసన వ్యక్తం చేశారు. దాంతో ప్రపంచ అథ్లెటిక్స్ రూల్ TR7.1 ప్రకారం అధికారులు ఆమెను డిస్క్వాలిఫై చేశారు. ఈ పోటీల ప్రయాణం అంతా ఫాతిమాకు ఎంతో శ్రమతో కూడుకున్నది. 100 మీటర్ల హర్డిల్స్‌ను 13.64 సెకన్లలో పూర్తి చేసి 1,030 పాయింట్లు సాధించింది. హైజంప్‌లో 1.77 మీటర్ల ఎత్తు దాటి 941 పాయింట్లతో టాప్‌లోకి వచ్చింది.

షాట్‌పుట్‌లో 11.72 మీటర్లు విసిరి 643 పాయింట్లు పొందింది. 200 మీటర్ల పరుగును 25.16 సెకన్లలో పూర్తి చేసి 872 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. లాంగ్ జంప్ సమయానికి పతకం ఖాయమనిపించినా.. షూ ఉల్లంఘన ఆమె ఆశలపై నీళ్లు చల్లింది. మరోవైపు భారత్ నుంచి బరిలోకి దిగిన పూజ, అనామిక కోజింజిపరంబిల్ తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఆరో ఈవెంట్ అయిన జావెల్రిన్ త్రో ముగిసేసరికి పూజ ఏడో స్థానంలో, అనామిక ఎనిమిదో స్థానంలో నిలిచారు.

చివరి ఈవెంట్లో పాయింట్లు సాధించేందుకు వీరు సిద్ధమవుతున్నారు. ఈ ఒక్క డిస్క్వాలిఫికేషన్‌తో హెప్టాథ్లాన్ పాయింట్ల పట్టిక పూర్తిగా మారిపోయింది. నిబంధనలు ఎంత కఠినంగా ఉంటాయో ఈ సంఘటన మరోసారి నిరూపించింది. పోటీదారులందరికీ ఇదొక హెచ్చరికగా నిలిచింది. శ్రమతో పాటు ప్రణాళిక, నిబంధనల అవగాహన ఎంత ముఖ్యమో స్పష్టమైంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>