నేడు ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ!

కలం, వెబ్ డెస్క్ : ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు అమరావతి సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ (AP Cabinet) సమావేశం జరగనుంది. సచివాలయ మొదటి బ్లాక్‌లో ఉదయం 10:30 గంటలకు ఈ భేటీ ప్రారంభం కానుంది. ప్రధానంగా రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ, స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్ (SIPB) ప్రతిపాదనలకు ఆమోదం తెలపడంతో పాటు వివిధ శాఖల మధ్య సమన్వయంపై మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. నవంబర్ 9 నాటికే వివిధ శాఖల ప్రతిపాదనల సమర్పణ గడువు ముగియగా, ముఖ్యాంశాలపై విస్తృత చర్చ జరగనుంది. అజెండా అంశాలు ముగిసిన అనంతరం రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల పరిస్థితులపై కేబినెట్ చర్చించే అవకాశం ఉంది.

నవంబర్ 12, 13 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న 31వ సీఐఐ పార్టనర్‌షిప్ సదస్సు ఏర్పాట్లే ఈ భేటీకి ప్రధాన ఎజెండాగా ఉంది. 58 దేశాల నుంచి అంతర్జాతీయ ప్రతినిధులు హాజరవుతున్న ఈ సదస్సు ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, పీయూష్ గోయల్ విచ్చేస్తున్నారు. ఇప్పటికే నిర్వహించిన ప్రాంతీయ సదస్సుల్లోరూ. 86,522 కోట్ల విలువైన 194 ఎంఓయూలు ఖరారు కాగా, సుమారు 1.4 లక్షల ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ మెగా ఈవెంట్ విజయవంతం చేసే బాధ్యతలను మంత్రులకు విడివిడిగా అప్పగించే అవకాశం ఉంది. ఇక ముగింపు సభకు ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ హాజరుకానున్నారు. సదస్సు ముగిసిన తర్వాత (నవంబర్ 13న) పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశాలు ఉన్నాయి.

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>