నిర్మల్‌లో ఘనంగా దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి

కలం, నిర్మల్ : నిర్మల్ (Nirmal) జిల్లా బీజేపీ కార్యాలయంలో జనసంఘ్ సిద్ధాంతకర్త పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ (Deendayal Upadhyaya) 110వ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ చరిత్ర, సిద్ధాంతాలు, సేవలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని అన్నారు. దేశం కోసం ఆయన చేసిన కృషి నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

బీజేపీలో పనిచేస్తున్న నాయకులు , కార్యకర్తలు దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ఆయన అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అయ్యన్నగారి భూమయ్య, రావుల రాంనాథ్, డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి, మెడిసెమ్మ రాజు, సామ రాజేశ్వర్ రెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు నిరంజన్ రెడ్డి, వెంకటేష్, సాత్విక్, హరీష్, నర్సారెడ్డి, సన్నీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>