కలం, వెబ్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియాను ఉద్దేశించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ ( Iran consulate Mumbai) అత్యంత వ్యంగ్యంగా, గట్టిగా స్పందించింది. భారత్‌ను ‘నరక కూపం’ అని వర్ణించిన ట్రంప్‌కు చురకలు అంటిస్తూ ఒక వీడియోను కూడా పోస్ట్ చేసింది. ‘‘బహుశా ఎవరో ఒకరు మిస్టర్ ట్రంప్‌కు ఒకసారి కల్చరల్ డిటాక్స్ (సాంస్కృతిక ప్రక్షాళన) పర్యటనను బుక్ చేయాలేమో. అప్పుడైనా ఆయన చేసే ఇలాంటి రాండమ్ బక్వాస్ (పిచ్చి వాగుడు) తగ్గుతుంది. ఒకసారి ఇండియాకు వచ్చి చూడు (కభీ ఇండియా ఆకే దేఖో).. ఆ తర్వాత మాట్లాడు” అని ట్విట్టర్ (X)లో ముంబై లోని ఇరాన్ ఎంబసీ పోస్ట్ చేసింది. మహారాష్ట్రలోని అందమైన పర్యాటక ప్రాంతాలు, సంస్కృతిని ప్రతిబింబించే ఒక వీడియోను షేర్ చేసింది.

