కొత్తగా కెమికల్ పార్కులు.. కేంద్రం కీలక నిర్ణయం

కలం, వెబ్ డెస్క్: దేశ వ్యాప్తంగా రసాయన రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ ఆద్యోగిక్ వికాస్ యోజన భవ్య అనే కొత్త పథకాన్ని ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.

దీనిలో భాగంగా దేశ వ్యాప్తంగా మూడు కొత్త కెమికల్ పార్కులు (Chemical Parks)  ఏర్పాటు చేయబోతుంది. ప్లగ్ అండ్ ప్లే విధానంలో ప్రారంభించబోతున్న ఈ పార్కులతో.. రసాయన పరిశ్రమల్లో భద్రత, వ్యర్థాల నిర్వహణపై ఇక నుంచి మరింత శ్రద్ధ పెట్టబోతున్నారు.

ఏపీకి కీలక ప్రాజెక్ట్..

ఏపీకి మరో కీలక ప్రాజెక్ట్ రాబోతుంది. బళ్లారి–గుంతకల్ రైల్వే సెక్షన్ మధ్య మూడు, నాలుగు లైన్ల నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.

రూ.1,264 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టును ఏపీ, కర్ణాటక ఎకానమిక్ కారిడార్‌లో భాగంగా దీన్ని విస్తరించబోతున్నట్లు ప్రకటించారు. అలాగే హోస్పేట్ నుంచి హుబ్బళ్లి మధ్య కొత్త లైన్ నిర్మాణానికి ఆమోదం లభించిందని.. డీపీఆర్ ప్రస్తుతం సిద్ధమవుతోందని వివరించారు.

Read Also: పెళ్లి ఖర్చు రూ.20 లక్షలా.. నెట్టింట చర్చ!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>