Mobile Popup Ad
Mobile Popup Ad

ఐపీఎల్ టికెట్ల విక్రయ ముఠా అరెస్ట్

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో ఐపీఎల్ (IPL) మ్యాచ్ టికెట్లను అక్రమంగా విక్రయిస్తున్న ముఠాను మల్కాజ్‌గిరి స్పెషల్ బ్రాంచ్, ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. మ్యాచ్ టికెట్లు ఇవ్వాలంటూ కొందరు వ్యక్తులు ప్రధాన మంత్రి కార్యాలయం, జడ్జిలు, గవర్నర్ కార్యాలయం, తమిళనాడు క్రికెట్ అసోసియేషన్, ముంబై క్రికెట్ అసోసియేషన్ పేర్లతో నకిలీ లెటర్లు తయారు చేస్తూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులకు ఫోన్లు చేస్తున్నారు. దీనిపై హెచ్‌సీఏ సెక్రటరీ మన్నే జీవన్ రెడ్డి మల్కాజ్‌గిరి సీపీ సుమతికి సమాచారం అందించారు.

టికెట్లు ఎరగా వేసి..

ముఠా సభ్యులను పట్టుకునేందుకు HCA సభ్యులు ప్రణాళిక వేశారు. టికెట్లు ఎరగా వేసి.. వాటిని బ్లాక్‌లో విక్రయిస్తుండగా.. ప్రధాన నిందితుడు అశోక్ ను పట్టుకున్నారు. మిగిలిన ముఠా సభ్యుల కోసం గాలింపు చేపట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>