Mobile Popup Ad
Mobile Popup Ad

ఐపీఎల్ మత్తులో బాల్యం.. గెలిస్తే హ్యాపీ, ఓడితే డిప్రెషన్!

కలం, వెబ్ డెస్క్: ప్రస్తుతం అందరికి ఐపీఎల్ (IPL) ఫీవర్ పట్టుకుంది. మైదానాల్లో వినిపించే కేకల నుంచి సోషల్ మీడియా వరకు అంతా క్రికెట్ మయమైపోయింది. ఈ క్రికెట్ ఫీవర్ ముఖ్యంగా చిన్నారులపై (Children) తీవ్ర ప్రభావం చూపుతోంది. తమ అభిమాన జట్టు గెలిస్తే పండగ చేసుకుంటున్న పిల్లలు, అదే జట్టు ఓడిపోతే తీవ్రమైన మానసిక వేదనకు గురవుతున్నారు. స్టేడియాల్లో ప్లకార్డులు పట్టుకుని సందడి చేస్తున్న దృశ్యాలు ఒకవైపు సంతోషాన్ని కలిగిస్తున్నా, ఆటను కేవలం వినోదంగా చూడలేక భావోద్వేగాలకు లోనవ్వడం ఆందోళన కలిగిస్తోంది.

ఐపీఎల్ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి విద్యార్థుల సగటు స్క్రీన్ టైమ్ ఎక్కువగా పెరిగినట్లు తెలుస్తోంది. సుమారు 60శాతం నుంచి 70శాతం మంది విద్యార్థులు రాత్రిపూట మ్యాచ్‌లు చూడటం వల్ల తమ నిద్రను, తద్వారా మరుసటి రోజు చదువుపై ఏకాగ్రతను కోల్పోతున్నారు. పరీక్షల సమయంలో కూడా పుస్తకాలను పక్కన పెట్టి స్కోర్ బోర్డులను ఫాలో అవ్వడం, మ్యాచ్ ఫలితాల గురించి ఇతరులతో గంటల తరబడి మాట్లాడటం చేస్తున్నారు. దీంతో చదువుల్లో రాణించలేకపోతున్నారు. కేవలం ఆటపైనే ధ్యాస ఉండటంతో హోం వర్క్, ఇతర పనులకు దూరమవుతున్నారు.

ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే అది క్రికెట్ అడిక్షన్‌గా మారి పిల్లల వ్యక్తిత్వ వికాసంపై దెబ్బతీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం ఆటను ఒక క్రీడగా మాత్రమే స్వీకరించేలా తల్లిదండ్రులు పిల్లలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. గెలుపోటములు సహజమని, చదువుతో పాటు ఆటలకు ఒక సమయం ఉండాలని గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ఐపీఎల్ సీజన్ కేవలం వినోదాన్ని మాత్రమే కాదు, విద్యార్థుల భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావాలను కూడా మిగులుస్తుంది. చిన్నతనంలోనే క్రీడా స్ఫూర్తిని నేర్పడం ముఖ్యం కానీ, అది వ్యసనంగా మారకుండా చూడటం బాధ్యతాయుతమైన పని అని మానసిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>