5 రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదల

కలం, వెబ్ డెస్క్ : దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఎగ్టిట్ పోల్స్ (Exit Polls ) ఫలితాలు వెల్లడయ్యాయి. వివిధ సంస్థలు ఓటర్ల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా వెల్లడైన ఈ ఎగ్జిట్ పోల్స్ లో సంచలనాలు నమోదు అయ్యాయి. పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ ని కాదని బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టినట్టు మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. తమిళనాడులో డీఎంకేకు మళ్లీ పాలన పగ్గాలు వస్తాయని తేల్చాయి. అయితే తమిళనాడు ఎన్నికల్లో తొలిసారి బరిలో నిలిచిన విజయ్ టీవీకేతో పాటు  అన్నా డీఎంకే సైతం గట్టి పోటీనిచ్చినట్లు వెల్లడించాయి. అటు అస్సాంలో బీజేపీ మరో భారీ విజయం సాధించబోతోందని ఎగ్జిట్ పోల్స్‌ ఫలితాలు చెబుతున్నాయి.

మరోవైపు కేరళలో ఈసారి అధికార మార్పు ఖాయంగా కనిపిస్తున్నట్లుగా తెలుపుతున్నాయి. పినరయి విజయన్ సర్కార్ హ్యాట్రిక్ విజయం సాధ్యం కాదని.. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ అధికారంలోకి వస్తుందని అంటున్నాయి. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఎన్డీఏ (NDA) కూటమి తన అధికారాన్ని నిలబెట్టుకోబోతుందని చెబుతున్నాయి.

చాణక్య స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇలా..

పశ్చిమ బెంగాల్ (మొత్తం 294):

బీజేపీ: 150 – 160
టీఎంసీ: 130 – 140

తమిళనాడు (మొత్తం 234):

డీఎంకే: 145 – 160
ఏడీఎఎంకే: 50 – 65
టీవీకే (విజయ్): 13– 18

కేరళ (మొత్తం 140):

యూడీఎఫ్‌: 72 – 80
ఎల్‌డీఎఫ్‌: 58 – 64

అసోం (మొత్తం 126):

బీజేపీ: 85 – 98
కాంగ్రెస్‌: 22 – 32

పుదుచ్చేరి (మొత్తం 30):

ఎన్‌ఆర్‌సీ: 15 – 17
కాంగ్రెస్‌: 11 – 13

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>