కలం, నల్లగొండ: ఈనెల 11న నల్లగొండ ఐటీ టవర్స్‌లో తెలంగాణ ఇన్నోవేషన్స్ ఆధ్వర్యంలో ఇన్నోవేషన్ పంచాయత్‌ను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ బి.చంద్రశేఖర్ (Collector Chandrashekar) తెలిపారు. ఇన్నోవేషన్ పంచాయత్‌పై (Innovation Panchayat) రూపొందించిన గోడ పత్రికను సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఆవిష్కరించారు. నూతన ఆవిష్కరణలు, అంకురాలను ప్రోత్సహించే ఉద్దేశంతో తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ ‘ఇన్నోవేషన్ పంచాయత్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల నుంచి ఆవిష్కర్తలను, వ్యవస్థాపకులను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమ లక్ష్యమన్నారు. ఆవిష్కర్తలకు, వారికి అవసరమైన తోడ్పాటుకు మధ్య ఉన్న భౌగోళిక దూరాన్ని తగ్గించడానికి రూపొందించిన వేదికగా ఇన్నోవేషన్ పంచాయత్‌ను రూపొందించారన్నారు.
యువత తమ ఆవిష్కరణ, పారిశ్రామిక ప్రయాణం గురించి సందేహాలుంటే నిపుణులతో సలహాలు పొందేందుకు గొప్ప అవకాశమన్నారు. రాష్ట్ర రాజధాని వెలుపల ఉన్న వ్యవస్థాపకులు, ఆవిష్కర్తలకు వనరులు సమానంగా అందుబాటులో ఉండేలా ఈ కార్యక్రమాన్ని (Innovation Panchayat) తీర్చిదిద్దారని పేర్కొన్నారు. వ్యాపారం, సాంకేతిక సవాళ్లను అక్కడికక్కడే పరిష్కరించవచ్చన్నారు. అంకురాలకు మద్దతుగా సమ్మిళిత వాతావరణాన్ని నిర్మించాలనే రాష్ట్ర ప్రభుత్వ నిబద్ధతను ఈ కార్యక్రమం బలపరుస్తుందన్నారు. జిల్లాల నుంచి ఆవిష్కర్తలు, ఔత్సాహిక వ్యవస్థాపకులు తప్పక పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న వారు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ కోరారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, డీఎఫ్ఓ రాజశేఖర్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, ఆర్డీవోలు రమణారెడ్డి శ్రీదేవి, ఈడియం దుర్గారావు, టీజీఐసీకో ఆర్డినేటర్లు అనూష ఉన్నారు.
Read Also: యుద్ధం ఎఫెక్ట్.. నిత్యావసర ధరలపై కేంద్రం కీలక ప్రకటన
Follow Us On: Facebook

